కొందరు ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్లను నవ్విస్తుంటారు.
దీంతో వారు ఏది చెప్పినా ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోరు.
‘వాడు చెప్పింది నమ్ముతున్నారా? వాడో కేతిగాడు’, ‘పట్టించుకో దగ్గ వ్యక్తి కాదు… కేతిగాడికి ఇతడికి తేడాలేదు’ ‘కేతిగాడిలా తెలివితక్కువ పనులు, పిచ్చి వేషాలు వేయకు’… ఇలాంటి మాటలు అక్కడక్కడా వినబడుతుంటాయి.
తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రల్లో జుట్టుపోలిగాడు, అల్లాటప్పగాడు, బంగారక్కలతో పాటు కేతిగాడు ఒకరు. మధ్యలో ఊడిపడి అప్పటికప్పుడు హాస్యం సృష్టించడంలో ఈ కేతిగాడు దిట్ట.
సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి