చరిత్రను ఒపాసన పట్టిన లక్ష్మీ శ్రీజ

లక్ష్మీ శ్రీజ… కాకతీయుల పాలన నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ, ముఖ్యమంత్రి పనితీరు, మంత్రుల పేర్ల నుంచి కరంట్ ఎఫైర్స్ వరకూ… మూడవ తరగతి చదువుతున్న ఆ చిన్నారి అనర్గళంగా చెబుతుంటే, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసి ఆనందించి ముగ్ధుడయ్యారు. అంతేనా, తన సొంత ఖాతా నుంచి అప్పటికప్పుడు రూ. 10 లక్షలు ఇచ్చారు. శ్రీజ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి, బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, సుధారాణి దంపతుల గారాలబిడ్డ లక్ష్మీ శ్రీజ చిన్నతనం నుంచి అపార జ్ఞాపకశక్తిని చూపించేది. ఈ విషయాన్ని గమనించిన పాప తల్లిదండ్రులు సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఈ పాప మేధస్సు గురించి ఇప్పటికే పలు పత్రికలు ప్రశంసించాయి. ఇక, క్యాంపు కార్యాలయానికి తల్లిదండ్రులతో సహా వచ్చిన శ్రీజ, సీఎంను కలువగా, అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిచ్చి కేసీఆర్ ను ఆకట్టుకుంది.

Leave a Comment