పెదగంగ ఉదకం: మన జాతీయాలు

పెదగంగ ఉదకం
గంగానది గురించి పురాణాల్లో ఎన్నో  విశిష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. ‘దేవగంగ’, ‘ఆకాశగంగ’ అనే పేర్లతో స్వర్గలోకంలో ప్రవహించేదట. ఆకాశగంగలో రాజహంసలు విహరిస్తాయట. బంగారు తామరలు అందంగా వికసిస్తాయట. స్వర్గానికి వెళ్లిన వారు ఇందులో స్నానం చేస్తారట. ఆకాశంలోని పాలపుంతను కూడా పెద గంగ అంటారు. ఆకాశ గంగ గొప్పదనం,  అందం మాట ఎలా ఉన్నా… అది నిజంగానే ఉందా? లేక కల్పనా? అనేది తెలియదు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టిందే ‘పెదగంగ ఉదకం’ పెదగంగ ఉదకం అంటే  ఆకాశగంగ. ఇది ఉందో లేదో ఎవరికీ తెలియదు. అంటే గగన కుసుమం లాంటిదన్నమాట!

సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి

Leave a Comment