అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్

అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్ వెలసింది. ఉన్న తెలుగు సంఘాలతో మైత్రీ బంధాన్ని పెనవేసుకుంటూ, తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కొన్ని వినూత్నప్రయత్నాలు తలపెడుతున్నట్టు న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ చిన్నా వాసుదేవరెడ్డి తెలిపారు. తెలుగువారి మధ్య న్యూజెర్సీ నగరంలో ఈ వేడుక జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రవాసభారతీయ విద్యార్థులు ప్రదర్శించినసాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే రీతిలో జరిగాయి.ఈ వేడుకలో న్యూజెర్సీ కాంగ్రెస్ మ్యాన్ గా తెలుగు వారి కీర్తిని ఇనుమడింపచేస్తున్న … Read more

కువైట్ లో తెలుగు కళా సమితి వారిచే విశిష్ట కళా ప్రదర్శన “స్వరాభినయ సంగమం”

కువైట్ లో తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుటలో “తెలుగు కళా సమితి” పెట్టింది పేరు. కువైట్ లో ఇంతటి గొప్ప పేరు కలిగిన ‘తెలుగు కళా సమితి’ మే 6 వ తేదీన, సాయంత్రం 5 గంటల నుండి మంగాఫ్ లోని కేంబ్రిడ్జి ఇంగ్లీష్ స్కూల్ లో తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలైన గుమ్మడి గోపాల కృష్ణ, 6 లైన్స్ గా అవబోతున్న బందర్ రోడ్డులో కంకిపాడు వద్ద వరల్డ్ క్లాస్ వెంచర్ విజిల్ శివప్రసాద్, సాకేత్ కోమండూరి, నికితా శ్రీవల్లి, సాయి హేమంత్ లచే “స్వరాభినయ సంగమం” … Read more

తెలుగు గజల్ రచనా పోటీలు… బహుమతులు: డా. గజల్ శ్రీనివాస్

గజల్ చారిటబుల్ ట్రస్ట్ (GCT) ఆధ్వర్యంలో తెలుగు గజల్ రచనా పోటీలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. గజల్ ఛందస్సు లక్షణాలతో భావ వ్యక్తీకరణ కలిగిన గజల్‌కు ప్రధమ బహుమతిగా రూ.10,000/-, ద్వితీయ బహుమతి గా రూ.7,000/-, తృతీయ బహుమతిగా రూ. 5,000/-మరియు మూడు ప్రోత్సాహక బహుమతులు ఒక్కింటికి రూ. 1,116/- అందజేయబడతాయని తెలిపారు. గజల్‌లో ఏడు షేర్‌లు మాత్రమే ఉండాలని, ప్రతి కవితను పంపిన ఎంట్రీలతో నాలుగు గజళ్ళు పంపవచ్చని, … Read more

తెలుగు పరిరక్షణకు కృషి చేయాలి: తనికెళ్ల

తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సినీనటుడు, కవి తనికెళ్ల భరణి అన్నారు. గురువారం గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరుకు వచ్చిన ఆయన తెలుగు పండితులతో ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాషా్ట్రల్లో కమ్మని తెలుగుభాషను పరిరక్షించేందుకు పండితులు నడుం బిగించాలన్నారు. source: Andhrajyothy

తెలుగులో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్

zirodha-telugu

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో పాలుపంచుకోవాలంటే ఆంగ్ల భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఈ కారణంగానే ప్రాథమిక విద్య మాత్రమే పూర్తి చేసిన భారతీయ గ్రామీణ ప్రజలు ట్రేడింగ్ లో ఇప్పటిదాకా కాలు మోపనే లేదు. అయితే ఇలాంటి వారి కోసం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘జిరోధా’ కీలక అడుగు వేసింది. ఇక నుండి, తెలుగులోనూ ట్రేడింగ్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. తద్వారా తెలుగు భాషను దేశంలోనే తొలి ప్రాంతీయ భాషా ట్రేడింగ్ ఫ్లాట్ ఫాంగా … Read more

ఆకాశవాణిలో రసవత్తర రంగస్థల వాణి

16 నుంచి 22 వరకు ఉదయం 9.30 నుంచి 60 నిమిషాలసేపు 7 నాటకాలు ప్రసారం కాబోతున్నాయి. హైదరాబాద్‌లోని నాటకరంగప్రముఖులు రూపొందించిన శ్రీనాథుడు, తర్వాత ‘ఒకే నిద్ర – ఎన్నో కలలు’ ఓ కాశీవాసా రావయ్యా, జగమేమారినది, ఆదిలాబాద్‌ శాలువా, ఇదిగో తోక – అదిగో పులి, బైపాస్‌ వరుసగా ఆలకించొచ్చు.

రాష్ట్ర విభజనతో నాటక రంగంలో సరికొత్త పోకడలు..!

తెలుగు నాటకరంగంలో రాష్ట్ర విభజన సరికొత్త పోకడలకు తెరతీసింది. తెలుగు నాటక దినోత్సవంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పండుగగా జరుపుకునే ఏప్రిల్‌ 16 ఇప్పుడు హైదరాబాద్‌లో పండుగ వాతావరణమే లేకుండా పోయింది. తొట్టతొలితెలుగు రంగస్థల ప్రదర్శనకు తెరతీసిన కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి నగరంలో అనామకం అయిపోయింది. గతంలో వేలాది మంది ఉత్సాహంగా ఊరేగింపులు తీసి సంబరాలు చేసుకున్న తెలుగురంగ స్థల దినోత్సవం ఈ ఏడాది నగరంలో వెలవెలబోతుంది. ఆదివారం సెలవు కలసిరావడంతో అలనాటి స్టేట్‌ ఫెస్టివల్‌ … Read more

తెలుగు వెలుగు వారధులను సన్మానించడం అభినందనీయం

telugu

తెలుగు భాషను, ఆధ్యాత్మికతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం కృషి చేస్తున్న మహానుభావులను సన్మానించే కార్యక్రమానికి తాను ముఖ్యఅతిథిగా రావడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌ అన్నారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు సనాతన ధర్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌లోని టివోలీ గార్డెన్‌లో శ్రీరామనవమి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ భవానీ ప్రసాద్‌ … Read more

కెనడాలో ఘనంగా ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ కల్గేరి’ ఉగాది వేడుక

telugu-canada

కెనడాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ కల్గేరీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 100కు పైగా తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. సాంప్రదాయ వస్త్రధారణలో అందరూ వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనిత కదం, మేఘన గుల్గోట ప్రదర్శించిన అర్ధనారీశ్వర నాట్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పంచాంగ శ్రవణాన్ని అందరూ శ్రద్ధగా ఆలకించారు. భరత నాట్యం, అంత్యాక్షరి తదితర కార్యక్రమాలు అలరించాయి. వేడుకలను ఇంత ఘనంగా … Read more

అక్షరాలను కుదించడమా? పదాలను పెంచడమా? తెలుగు భాషాభివృద్ధికి మేలు చేసేదెలా?

పల్లెప్రపంచం విజన్ లో భాగమైన ఒక అంశం: “తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడం.” ఆ మేరకు నా వంతు ప్రయత్నంగా తెలుగు భాషకు సంబంధించిన సమాచార సేకరణలో భాగంగా కొన్ని ప్రశ్నలుంచాను. భాషపై అభిమానమున్నవారే కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత అనవసర వాదులాటలు ఆవేశకావేశాలు దొర్లినా మొత్తం మీద తెలుగు భాషాభివృద్ధిపై మన బ్లాగర్లంతా మంచి కృషే చేస్తున్నారు. తెలుగు వెలుగులు విరజిమ్మించగల సత్తా ఉన్నవారు నేటికీ ఉన్నారనిపించడం సంతోషించదగ్గ విషయం. మాతృభాషపై మమకారం తగ్గుతున్నదన్న వాదన … Read more