ఊటుకూరు భూదేవి

ఊటుకూరు భూదేవి

పాశ్చాత్య వ్యామోహంలో పడి తెలుగు భాష అంతరించి పోకూడదు. పదికాలాల పాటు మనగలగాలి అని ఆశించే వారిలో ప్రధమురాలు భూదేవి. కళామైత్రి సంస్థను స్థాపించి తెలుగు భాషా సంస్కృతి ప్రచారంలో భాగంగా శతకామృతవర్షిణి పేరిట నాటి కవులు రచించిన పలు శతకాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని గొంతెత్తి ఆమె తన పాటల ద్వారా అనేక ప్రదర్శనలిచ్చి తద్వారా తన వంతుగా తెలుగుతల్లికి నీరాజనాలర్పిస్తున్నారు. ఇంకా చదవండి

బూర్గుల రామకృష్ణారావు

burgula_ramakrishanarao

హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. ఈయన రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు. బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. పారశీక వాఞ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం మొదలైనవి ఆయన ఇతర రచనలు.వీరు రచించిన … Read more

ఆదికవి నన్నయ

adikani nannaya

నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి మరియు వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం (ముగ్గురు కవులు)లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద … Read more