ఉగాది…

ఉగస్య ఆది ఉగాది … ఉగ అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ’ఆది’ ’ఉగాది’ అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. తత్రచైత్రశుక్ల చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది ‘ఉగాది’గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు. kokila
ఉగాది పండుగ రోజు షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం, పూర్ణకుంభ దానం చేయడం సాంప్రదాయం. ఉగాదిరోజున సూర్యోదయానికి పూర్వమే తలంటుస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, సూర్యనమస్కారం చేసి అర్ఘ్యం, ధూప దీపాలతో కొలిచి ” సంకల్పాదౌ నూతన వత్సర నామకీర్తనం” అన్నట్టు నూతన సంవత్సరం పేరు చెబుతూ సంకల్పం  చెప్పాలని ధర్మసింధువు చెబుతుంది. తరువాత వేపపూవు పచ్చడిని భగవంతునికి నివేదించి ఏమీ తినకముందే దానిని సేవించాలి. మధుర, ఆమ్ల, కటు, కషాయ, లవణ, తిక్తయను షడ్రుచుల, మేళవింపు అయిన ఉగాది పచ్చడిని సంస్కృతంలో ”  నిమ్బకుసుమభక్షణం ” అంటారు. వసంతకాలంలో వచ్చే రుగ్మతలను తొలగించే దివ్య ఔషధంగా  పనిచేస్తుంది ఉగాది పచ్చడి. దీన్ని సేవిస్తే…. ” శతాయుర్వజ్రదేహాయుః ” సర్వసంపత్కర్తాయ, సర్వారిష్టవినాశాయ నిమ్బకుసుమ భక్షణం అన్నట్టు ద్రుఢమైన దేహంతో పాటు అదృష్టం కలిగి వస్తుందని శాస్త్రవచనం.
ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు’ వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

ugadi-pachchadi

 

ఈ దుర్మఖి నామ సంవత్సరం మీకు అన్ని విధాలా శుభాలను చేకూర్చాలని కోరకుంటూ …

 

 

ఇంకా అనేక విషయాలను క్రింది లింకుల ద్వారా తెలుసుకోండి-

http://www.telugudanam.co.in/samskruti/pamDugalu/ugaadi.php

http://www.suryaa.com/features/article.asp?subCategory=6&ContentId=205405

http://www.sakalapoojalu.com/pandugalu/%E0%B0%AF%E0%B1%81%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%89%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF/details.html?pid=429

http://www.sakalapoojalu.com/pandugalu/%E0%B0%89%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%82/details.html?pid=375

https://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF

Leave a Comment