తెలుగు పరిరక్షణకు కృషి చేయాలి: తనికెళ్ల

తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సినీనటుడు, కవి తనికెళ్ల భరణి అన్నారు. గురువారం గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరుకు వచ్చిన ఆయన తెలుగు పండితులతో ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాషా్ట్రల్లో కమ్మని తెలుగుభాషను పరిరక్షించేందుకు పండితులు నడుం బిగించాలన్నారు.

source: Andhrajyothy

Leave a Comment