మలేసియాలో తెలుగు అంతర్జాతీయ కేంద్రం

మలేసియాలో నివసిస్తున్న లక్షలాది మంది తెలుగువారి సంక్షేమం, భాషాభివృద్ధికి మలేసియా ప్రభుత్వం బాగా సహకరిస్తోందని మలేసియా తెలుగు సంఘం(టామ్‌) అధ్యక్షుడు డా. అచ్చయ్యకుమార్‌ తెలిపారు. కౌలాలంపూర్‌ చివరిన రెండున్నర ఎకరాల్లో అంతర్జాతీయ తెలుగు కేంద్రం, భవన నిర్మాణం ప్రారంభించామని, మరో ఏడాదిలోగా ఈ భవనం పూర్తవుతుందన్నారు. రూ.15కోట్లతో నిర్మించే ఈ భవనానికి కౌలాలంపూర్‌ ప్రభుత్వం రూ.5కోట్లు అందించిందని తెలిపారు. 

Source: Andhrajyothy

Leave a Comment