తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ఈనెల 16వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రచలనచిత్ర, టివి, నాటకరంగ అభివృధ్ధి సంస్ధ సౌజన్యంతో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమం 16వ తేదీ సాయంత్రం 5 గంటలనుండి బాపూజీ కళామందిర్‌లో జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా లబ్దప్రతిష్టులైన కళాకారులను కందుకూరి విశిష్ఠ పురస్కారంతోసన్మానించడం జరుగుతుందన్నారు. ఈ లబ్దప్రతిష్టుల ఎంపిక కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో పూర్తి అయిందని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి రాష్ట్రస్థాయి అవార్డుకు వై.గోపాలరావును ఎంపికచేయడం జరిగిందని, జిల్లా స్థాయిలో ఆర్‌డివి ప్రసాద్, బి.ఎ, మోహనరాు, పన్నాలనరశింహమూర్తి, వంజరాపు సత్యం, పైడి సత్యవతిని ఎంపిక చేశారని తెలిపారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికార,అనధికారులు, కళాకారులు,కళా సంస్ధలు పాల్గొంటాయని చెప్పారు.జిలా నలుమూలల నుండి కళాకారులు ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. –