సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి అమెరికా ప్ర‌భుత్వం అనుమతి

సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి అమెరికా ప్ర‌భుత్వం అన్ని అనుమ‌తులు ఇచ్చింది. భారతీయ క‌ళ‌లు, కూచిపూడి, క‌ర్ణాట‌క సంగీతంలో డిప్లోమా, డిగ్రీ స్థాయిల్లో కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు రాజ‌ముద్ర పడింది. ఈ కోర్సుల్లో ప‌ట్టాలు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభ‌మైన సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి కాలిఫోర్నియా రాష్ట్రంలో అనుమ‌తులు ల‌భించాయి.siliconandhra university IMG_3528

12వ త‌ర‌గ‌తి పాసైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేర‌డానికి అర్హులు. భార‌త‌దేశం బ‌య‌ట తొలిసారిగా భార‌తీయ క‌ళ‌ల‌ను గుర్తిస్తూ ఆ క‌ళ‌ల‌కు ప‌ట్టం క‌ట్ట‌డంలో సిలికానాంధ్ర విజ‌యం సాధించింది. ఇలా భార‌తీయ కోర్సుల్లో ప‌ట్టాలు సంపాదించే అవ‌కాశం ఎక్క‌డా జ‌రిగిన దాఖ‌లాలు లేవు. సిలికానాంధ్ర‌వారు రెండేళ్ల క్రితం ప్ర‌య‌త్నాలు ప్రారంభించి ఈ క్ర‌మంలో విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం త‌ర‌గ‌తులు ప్రారంభించేందుకు సంసిద్ధులు అయ్యారు.

link : http://namastheandhra.com/siliconandhra-university-got-green-signal-from-us-govt/

Leave a Comment