సంపాతి జటాయువులు…
చాలా పాత తరం వ్యక్తులు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఇది. సంపాతి మరియు జటాయువులు రామాయణంలో పాత్రలు. సంపాతి, జటాయువులు అన్నదమ్ములు. గద్దలు. సూర్యమండలానికి ఎవరు త్వరగా చేరుకుంటారనే దానిపై ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడతారు. ఈ పోటీలో జటాయువు త్వరగా సూర్యమండలం వైపు దూసుకెళతాడు. ఈ సమయంలో జటాయువు రెక్కలు కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సంపాతి తన రెక్కలు అడ్డుపెడతాడు. రెక్కలు కాలిపోతాయి.
జటాయువు సీతమ్మను రక్షించే ప్రయత్నంలో రావణాసురుడితో యుద్ధం చేసి చనిపోయిన విషయం తెలిసిందే. సంపాతి, జటాయువుల త్యాగాల మాట ఎలా ఉన్నా… ‘పాత తరం వ్యక్తులు’, ‘చాలా అనుభవం ఉన్న వాళ్లు’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఏదైనా సందేహం ఉంటే వాళ్లను అడుగు. ఎంతో అనుభవం ఉన్నవాళ్లు. సంపాతి జటాయువులు’ అంటారు.
సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి