తెలుగువారి హృదయనేత్రి మాలతీ చందూర్

maalatee chandoorఅలనాటి తెలుగు పత్రికలతో పరిచయం ఉన్న ప్రతి పాఠకుడికీ/పాఠకురాలికీ మాలతీ చందూర్ పేరు సుపరిచితమే. ఆంద్రప్రభ లో ప్రమదావనం శీర్షిక తో..స్వాతిమాసపత్రికలో పాతకెరటాలు శీర్షికతో దశాబ్దాల తరబడి సాహితీ ప్రియులను ఆకట్టుకున్నారు. ప్రమదావనం లో అయితే అంతర్జాతీయ వార్తల దగ్గరనుండి అంతరిక్షం దాకా దేని గురించి అడిగినా చాలా లోతుగా విశ్లేషించి మరీ చెప్పేవారు. కుటుంబ సమస్యల నుండి అంతర్జాతీయ సమస్యల వరకు చాలా విస్తృతంగా ప్రశ్నలు ఉండేవి. ఆవిడ కూడా అంతే విస్తృతంగా సమాధానాలు చెప్పేవారు. అసలు ఆవిడకి తెలియని విషయం ఉండేది కాదు. తెలియకపోయినా తెలుసుకుని చెప్పేవాళ్లు.

భర్త చందూర్‌ను ఎప్పుడూ ”మామయ్య”గానే సంబోధించే మాలతి పల్లెటూరిలో పెరిగిన తనను ఓ వ్యక్తిగా, ఇంత పెద్ద రచయిత్రిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని బాహాటంగా చెబుతుండేవారు. తన పేరులోనే భర్త పేరును చేర్చుకున్న ఆమె భార్యాభర్తల సంబంధాలకు ఏంతో విలువనిచ్చేవారు. ఆమె చదువుకున్నది ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. దాకానే అయినా, సమాజాన్నీ, జీవితాన్నీ ఆమె కాచివడపోశారు. ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకి పరిచయం చేసిన అతి కొద్ది మంది రచయిత్రిలలో మాలతి గారు ఒకరు.హృదయ నేత్రి

2013 ఆగస్టు 21 న చెన్నైలో ఈమె కన్ను మూసారు. చనిపోవడానికి ముందు కొద్ది రోజులు ఈవిడ క్యాన్సర్ వ్యాధి గ్రస్తులయ్యారు. రచయితలు పుడతారు , పోతుంటారు . సమాజానికి మేలు చేసే రచనలు చేసి చదువరుల్ని ఉత్తేజింప చేసి , ఆలోచింప జేసే వారు ఎంతో మంది ఉన్నారు .కానీ హారంలో మణి పూసలా అత్యున్నతమైన స్థానాన్ని , ప్రత్యేకతని సంతరించుకున్న మాలతీ చందూర్ లాంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకరు రారు . ఆమె ప్రత్యేకత ఆమెకే సొంతం .

వీరి గురించిన మరిన్ని వివరాలు క్రింది లింకులలో చదవండి :

http://ishtapadi.blogspot.in/2013/08/blog-post_6582.html

http://vareesh.blogspot.in/2013/08/blog-post_22.html

vihanga.com/?p=9967

వికీపీడియా