తెలంగాణ జానపదం -ఒగ్గు కథ. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం.తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పూర్వం పల్లెల్లో వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు ఈ డిజిటల్ మాయాజాలం వచ్చిన తర్వాత ఇవన్నీ కనుమరుగై పోతున్నాయి. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. ఆ ఒగ్గు కథకు జీవం పోస్తున్న కళాకారులు ఎందరో ఉన్నారు. అటువంటి కళాకారుల్లో పేరొందిన ఒగ్గుకథకుడే చుక్క సత్తెయ్య ..
శ్రీ చౌదరపల్లి చుక్క సత్తెయ్య వరంగల్ జిల్లా జనగాంకు సమీపంలోని మాణిక్యాపురం అనే గ్రామంలో జన్మించారు . తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఒగ్గుకథ లో తన 18వ ఏటకే ప్రావీణ్యత సంపాదించారు. ఈయన దేశ విదేశాల్లో దాదాపు 12,000 ప్రదర్శనలు ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ఈయన పెద్దగా చదువుకోలేదు. తనంతతానుగా తెలుగులో వ్రాయడం , చదవడం నేర్చుకుని తనకున్న కళపై పట్టుతెచ్చుకున్నారు
మొదట్లో ఈయన కేంద్ర ప్రభుత్వం యొక్క 20సూత్రాల కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను తన ఒగ్గుకథ ద్వారా తెలియచేసే ప్రచారంలో పాల్గొన్నారు.
Life History and Awards of Chukka Satteyya
Chowdarapally Chukkasattiah
Father’s name: Agaiah
Date of Birth: 29-03-1931
Occupation: Oggukatha Instructor (Shivashaktulu)
Department of Folk Arts, P.S. Telugu University
Public Garden, Hyderabad-500004
Permanent Address: Village: Manikyapuram,
Mandal: Lingala Ghanapuram,
District: Warangal, Andhra Pradesh, India
PIN:506201
Awards: Kendriya Sangeet Natak Akedamy Award (from Hon’ble President of India A.P.J. Abdul Kalam 2004)
Doctor of Letters (from Kakatiya University, Warangal, April 15, 2005)
Oggu kalaa Samrat (from Venkateshwara Cassette Center)
Janapada Kala Murthy (from Yatri KrishnaRao Andhra University Director, Vishakapatnam)
Makutamleni Maharaju (from Disco Recording Company Secunderabad)
Kalasagar (visista puraskar)
Given Programs in the following Departments:
Andhra Pradesh Cultural Affairs
South Zone Cultural Center, Thanjavur
South Central Cultural Sone, Nagpur
Song & Drama B.Grade Group Leader
A.P. Information & Broadcasting Department
All India Radio, vijayawada
All India Radio, Kurnool
All India Radio, Vishakapatnam
All India Radio, Warangal
All India Radio, Kothagudem
All India Radio, Hyderabad
Doordarshan and Films
District Public Relation Department
Medical and Health Department, Medak
Professional Experience: 40years in the Concerned Field
Training and Teaching: Training has been given to morethan 1500 students in 7 districts in A.P. i.e., Hyderabad, Rangareddy, Nalgonda, Warangal, Khammam, Krishna and Guntur
Stage Performances: Morethan 1200 performances were given till now.
ఇంకొన్ని లింకులు :
http://telanganagalalu.blogspot.in/2011/04/blog-post_1182.html
http://manatelanganamovies.blogspot.in/2015/05/oggu-katha-sattaiah-has-award-under.html
https://www.mixcloud.com/discover/yellamma-oggukatha-by-chukkasattaiah/