Dasaratha Kruta Shani Stotram in Telugu శని స్తోత్రం దశరథ కృతం

దశరథ ప్రోక్త శని స్తోత్రం అను నిత్యం చదవడం వల్ల శనీశ్వరుడి ఆశీస్సులు లభించి ఈతి బాధలన్నీ తొలగిపోతాయి.

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ ।
నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ ॥ 1 ॥

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ ।
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక ॥ 2 ॥

నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః ।
నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః ॥ 3 ॥

నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే ।
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే ॥ 4 ॥

నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః ।
నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే ॥ 5 ॥

సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే ।
అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే ॥ 6 ॥

నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః ।
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ ॥ 7 ॥

జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే ।
తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్ ॥ 8 ॥

దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః ।
త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే ॥ 9 ॥

బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః ।
రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః ॥ 10 ॥

త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః ।
ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః ॥ 11 ॥

‘ఈ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి కర్మ ఫలితాన్ని అనుభవించాలి. కర్మ ప్రదాత భూమి మీద శని భగవానుడే. శని భగవానుడు జాతకంలో ఏలినాటి శని రూపంలో, అర్ధాష్టమ శని రూపంలో, అష్టమ శని రూపంలో ఏ వ్యక్తికైనా గోచార పరంగా వచ్చినప్పుడు ఆ వ్యక్తి జాతక బలాన్ని బట్టి, ఆ వ్యక్తి ఆచరించే కర్మను బట్టి ఫలితాలు ఉంటాయి. శని మహర్దశ, శని అంతర్దశ ఉన్న వారికి కూడా శని ప్రభావం చేత ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఏర్పడవచ్చు. జాతకంలో శని శుభ స్థానంలో ఉంటే, శని భగవానుడిని పూజిస్తూ, అర్చిస్తూ, ఆరాధిస్తూ ఉంటే శని స్తోత్రాలు వంటివి చదువకుంటూ ఉంటే అటువంటి వారికి శని భగవానుడు మంచే చేస్తాడు..