వారాహి నవరాత్రులు 2025 లో వారాహీ నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి తెలుసా? ప్రతీ సంవత్సరం ఆషాడ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి. ఈ సంవత్సరం జూన్ 25 నుండి జూలై 3 వరకు వచ్చే ఆషాఢ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది పగళ్లు మరియు రాత్రులు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ప్రతిరోజూ రోజువారీ హోమం మరియు అభిషేకం నిర్వహిస్తారు. లక్షలాది మంది తమ తమ కోర్కెల కోసం ఏంతో భక్తి శ్రద్దలతో .. నిష్టగా ప్రతీ ఏటా చేస్తారు.
ఈ పూజను ప్రతీరోజూ సూర్యాస్తమయం అయ్యాక చేస్తారు. వారాహిమాతను లలితమ్మ అంగ దేవతగా శ్రీవిద్య లో పూజ చేస్తే ఆమె పూజ రాత్రి సమయంలో మటుకే చేయాలి..వారహిని ప్రధాన దేవతగా పూజించే సమయంలో మూడు కాలాల్లో పూజ చేయవచ్చు.. ఉదయం సాయంత్రం కూడా వారాహి నవరాత్రి జరిపే రోజుల్లో పూజ చేయవచ్చు…
వరాహ అవతార శక్తి స్వరూపిణి
వారాహి దేవి శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతార శక్తి స్వరూపిణి. ఈమె వరాహ ముఖంతో, మానవ శరీరంతో కనిపిస్తుంది. దశమహావిద్యలలో ఒకరైన వారాహి అమ్మవారు, లలితా దేవి సేనాధిపతిగా (దండనాథ) ప్రసిద్ధి చెందింది. ఈమె అసురుల సంహారంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.
శ్రీ వారాహి గుప్త నవరాత్రులు
వారాహి నవరాత్రి మహోత్సవం – 2025 తేదీలు: 26 జూన్ 2025 నుండి 04 జూలై 2025 వరకు. ఈ ఏడాది గుప్త నవరాత్రి ఎంతో శక్తిమంతమైన కాలంలో వస్తోంది!
- జూన్ 26, గురువారం: అదివారాహి
- జూన్ 27, శుక్రవారం: దండిని వారాహి
- జూన్ 28, శనివారం: బృహద్ వారాహి
- జూన్ 29, ఆదివారం: ఉన్మత్త వారాహి
- జూన్ 30, సోమవారం: స్వప్న వారాహి
- జూలై 1, మంగళవారం: ధూమ్ర వారాహి
- జూలై 2, బుధవారం: వజ్ర వారాహి
- జూలై 3, గురువారం: శ్వేత వారాహి
- జూలై 4, శుక్రవారం: కిరాత వారాహి
- జూలై 5, శనివారం: మహా వారాహి
వారాహి నవరాత్రులు జరుపుకోవడం వల్ల ప్రయోజనాలు
ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారికి శుభం, ఐశ్వర్యం, రక్షణ లభిస్తుందని చెబుతారు. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు శుద్దీకరణకు కూడా సమయం. వారాహి భక్తులు పండుగ సమయంలో తరచుగా ఉపవాసం ఉంటారు మరియు వారు ప్రత్యేక పూజలు మరియు ఆచారాలను కూడా నిర్వహిస్తారు.
ఏ వ్యక్తికైనా జీవితములో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము కలుగుతుంది. అలాంటి దృష్టి దోషాలు, దిష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు పిశాచ పీడా భయాందోళనలు వంటివి తొలగడానికి వారాహిమాత పూజ చాలా విశేషమైనది. సమాజంతో కీర్తి కలగడానికి, గుర్తింపు పొందడానికి, అనుకున్న పనులయందు విజయాన్ని పొందడానికి వారాహిదేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన సత్ఫలితాలు పొందవచ్చు.
వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రు భయం తొలగిపోయి, వారిపై విజయం లభిస్తుందని నమ్ముతారు. కోర్టు కేసులు, వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి వాటి నుంచి బయటపడటానికి వారాహి పూజ చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు. దుష్ట శక్తులు, చెడు ప్రభావాల నుండి రక్షణ కల్పిస్తుంది.
వారాహి దేవి ఆయుర్వేద వైద్య దేవతగా కూడా పూజింపబడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారికి ఈమె పూజించడం వల్ల ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
భూమికి అధిదేవత కాబట్టి, భూమికి సంబంధించిన వివాదాలు తీరడానికి, సొంత ఇల్లు లేదా భూమి సంపాదించడానికి ఈమెను పూజించడం వల్ల మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం.
శ్రీ వారాహి అమ్మవారి పూజా విధానం PDF
వారాహి దేవి 16 నామాలు -శ్రీ వారాహీ షోడశ నామావళిః
ఓం శ్రీ బృహత్ వారాహ్యై నమః
ఓం శ్రీ మూల వారాహ్యై నమః
ఓం శ్రీ స్వప్న వారాహ్యై నమః
ఓం శ్రీ ఉచిష్ట వారాహ్యై నమః
ఓం శ్రీ వార్దలీ వారాహ్యై నమః
ఓం శ్రీ భువన వారాహ్యై నమః
ఓం స్తంభన వారాహ్యై నమః
ఓం బంధన వారాహ్యై నమః
ఓం పంచమీ ప్వారాహ్యై నమః
ఓం భక్త వారాహ్యై నమః | 10 |
ఓం శ్రీ మంత్రిణీ వారాహ్యై నమః
ఓం శ్రీ దండినీ వారాహ్యై నమః
ఓం అశ్వ రూడ వర్హ్యై నమః
ఓం మహిషా వాహన వారాహ్యై నమః
ఓం సింహ వాహన వారాహ్యై నమః
ఓం మహా వారాహ్యై నమో నమః | 16 |
ఇతి శ్రీ వారాహీ షోడశ నామావళిః ||
శ్రీ వారాహి అమ్మవారి చిత్ర పటం – HQ Image

తంత్ర సాధన చేసే వారికి వారాహి నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో వారాహి యంత్ర పూజలు, హోమాలు, మంత్ర జపాలు, చండీ పాఠాలు చేయడం ద్వారా శక్తి సిద్ధులు పొందుతారని నమ్ముతారు. గురువు అనుమతితో ఈ పూజలు చేయడం మరింత శ్రేష్ఠం. వారాహి అమ్మవారిని వాక్ సిద్ధి ప్రసాదించే దేవతగా కూడా కొలుస్తారు. ఈమెను నియమబద్ధంగా పూజించిన వారికి మంచి మాట తీరు, వాక్ చాతుర్యం, వాక్ సిద్ధి లభిస్తాయని చెబుతారు.వారాహి నవరాత్రులు కేవలం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా, మనలోని అహంకారం, అసూయ, ద్వేషం వంటి వాటిని తొలగించి, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి కూడా సహాయపడతాయి.
వారాహి నవరాత్రి దీక్ష, పాటించవలసిన నియమాలు
- ఇంట్లో పది రోజులు పూర్తిగా శాకాహారమే వండాలి. వండిన ప్రతి పదార్థాన్ని మొదట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, అనంతరం ప్రసాదంగా స్వీకరించాలి.
- పూజ సమయంలో ఇంట్లో అఖండ దీపం వెలిగించడం మంచిది. దీపం నిలకడగా వెలిగుతూ ఉండేలా చూసుకోవాలి, ఇది అమ్మవారి శక్తికి సూచికగా భావించబడుతుంది.
- వారాహి అమ్మవారు భూమికి మరియు పాడి పంటలకు సంబంధించిన దేవతగా ప్రసిద్ధి చెందారు. కాబట్టి నవరాత్రి మొదటి రోజున ఒక కొత్త కుండలో శుద్ధమైన మట్టిని వేసి, అందులో నవధాన్యాలను (9 రకాల ధాన్యాలు) నాటాలి. ఆ మట్టితో నిండిన పాత్రను అమ్మవారి పూజాస్థలిలో ఉంచాలి. పదవ రోజుకి అవి ఆరోగ్యంగా మొలకెత్తితే, మీరు చేసిన సంకల్పం ఆటంకం లేకుండా నెరవేరుతుందని భావించవచ్చు. ఆ మొలకల ధాన్యాలను ఆవులకు తినిపించడం ద్వారా పూజ ఫలాన్ని సమర్పించినవారవుతారు.
- ప్రతి రోజు పసుపుతో గణపతిని తయారు చేసి పూజ చేయాలి. పూజ అనంతరం ఆ పసుపును వాడుక పసుపుగా ఉతికి భద్రపరచవచ్చు. ఇది పూజా శుద్ధతకు గుర్తుగా ఉంటుంది. ఇక మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంటే, ప్రతిరోజూ పసుపునీటితో అభిషేకం చేయవచ్చు. ఫోటో ఉంటే పువ్వులతో పూజ సరిపోతుంది. అయితే విగ్రహం లేదా ఫోటో ఏది లేకపోయినప్పటికీ, ఇంట్లో ఉన్న ఏదైనా అమ్మవారి రూపం ముందు దీపం వెలిగించి, వారాహిగా ఆహ్వానించి పూజ చేయవచ్చు.
- దీపానికి అభిషేకం చేయాలంటే ఒక స్పూన్‌లో అభిషేక ద్రవ్యం తీసుకుని మంత్ర పఠనం చేస్తూ దీపానికి చూపించి, ఒక పాత్రలో ఆ ద్రవాన్ని పోసి, దానిని ఆచమనం నీళ్లు/తీర్థంగా ఉపయోగించవచ్చు. ఇది ఆలయ సంప్రదాయాన్ని ఇంటి పూజలో కలిపే ఒక శ్రద్ధావంతమైన విధానం.
- యంత్ర పూజ తెలిసిన వారు, ప్రతిరోజూ శ్రీచక్ర యంత్రం లేదా వారాహి యంత్రాన్ని శుద్ధ చేసి పూజ చేయవచ్చు. మధ్యాహ్న భోజనం చేయొచ్చు కానీ సాయంత్రం పూజకు ముందు స్నానం చేసి, శుద్ధంగా భక్తితో పూజ చేయాలి.
- నైవేద్యం విషయానికి వస్తే, మీకు అందుబాటులో ఉన్నవి మాత్రమే పెట్టండి. ఇంకొంతమంది చేస్తున్నట్టు అర్భాటంగా చేసేందుకు అప్పులు చేయడం, పోటీ పడడం అవసరం లేదు. తలచినట్లు కాకుండా, తలంపుతో చేసిన పూజే అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది.
వారాహి సహస్రనామావళి Download PDF
శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం
అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |
అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |
సర్వ సంకట హరణ జపే వినియోగః ||
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా ||
వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే ||
నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |
సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ||
ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం
వారాహి అష్టోత్తర శతనామావళి | Sri Varahi Ashtottaram
వారాహి అష్టోత్తర శతనామావళిలో అమ్మవారి 108 పవిత్ర నామాలు ఉంటాయి. ఈ నామాలు అమ్మవారి గొప్పదనాన్ని, ఆమె శక్తిని తెలియజేస్తాయి. ఈ అష్టోత్తరాన్ని రోజూ పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, శత్రు భయం తొలగిపోతుంది. ముఖ్యంగా వారాహి నవరాత్రుల సమయంలో, ప్రతి రోజు ఈ స్తోత్రాన్ని పఠించడం విశేష ఫలితాలనిస్తుంది. అమ్మవారిని పూలతో అలంకరించి, ఈ నామావళితో పూజిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుంది.
వారాహీ అష్టోత్తర శత నామావళి
ఓం వరాహవదనాయై నమః ।
ఓం వారాహ్యై నమః ।
ఓం వరరూపిణ్యై నమః ।
ఓం క్రోడాననాయై నమః ।
ఓం కోలముఖ్యై నమః ।
ఓం జగదంబాయై నమః ।
ఓం తారుణ్యై నమః ।
ఓం విశ్వేశ్వర్యై నమః ।
ఓం శంఖిన్యై నమః ।
ఓం చక్రిణ్యై నమః । 10
ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః ।
ఓం ముసలధారిణ్యై నమః ।
ఓం హలసకాది సమాయుక్తాయై నమః ।
ఓం భక్తానాం అభయప్రదాయై నమః ।
ఓం ఇష్టార్థదాయిన్యై నమః ।
ఓం ఘోరాయై నమః ।
ఓం మహాఘోరాయై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం వార్తాళ్యై నమః ।
ఓం జగదీశ్వర్యై నమః । 20
ఓం అంధే అంధిన్యై నమః ।
ఓం రుంధే రుంధిన్యై నమః ।
ఓం జంభే జంభిన్యై నమః ।
ఓం మోహే మోహిన్యై నమః ।
ఓం స్తంభే స్తంభిన్యై నమః ।
ఓం దేవేశ్యై నమః ।
ఓం శత్రునాశిన్యై నమః ।
ఓం అష్టభుజాయై నమః ।
ఓం చతుర్హస్తాయై నమః ।
ఓం ఉన్మత్తభైరవాంకస్థాయై నమః । 30
ఓం కపిలలోచనాయై నమః ।
ఓం పంచమ్యై నమః ।
ఓం లోకేశ్యై నమః ।
ఓం నీలమణిప్రభాయై నమః ।
ఓం అంజనాద్రిప్రతీకాశాయై నమః ।
ఓం సింహారుఢాయై నమః ।
ఓం త్రిలోచనాయై నమః ।
ఓం శ్యామలాయై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం ఈశాన్యై నమః । 40
ఓం నీలాయై నమః ।
ఓం ఇందీవరసన్నిభాయై నమః ।
ఓం ఘనస్తనసమోపేతాయై నమః ।
ఓం కపిలాయై నమః ।
ఓం కళాత్మికాయై నమః ।
ఓం అంబికాయై నమః ।
ఓం జగద్ధారిణ్యై నమః ।
ఓం భక్తోపద్రవనాశిన్యై నమః ।
ఓం సగుణాయై నమః ।
ఓం నిష్కళాయై నమః । 50
ఓం విద్యాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం విశ్వవశంకర్యై నమః ।
ఓం మహారూపాయై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం మహేంద్రితాయై నమః ।
ఓం విశ్వవ్యాపిన్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం పశూనాం అభయంకర్యై నమః ।
ఓం కాళికాయై నమః । 60
ఓం భయదాయై నమః ।
ఓం బలిమాంసమహాప్రియాయై నమః ।
ఓం జయభైరవ్యై నమః ।
ఓం కృష్ణాంగాయై నమః ।
ఓం పరమేశ్వరవల్లభాయై నమః ।
ఓం సుధాయై నమః ।
ఓం స్తుత్యై నమః ।
ఓం సురేశాన్యై నమః ।
ఓం బ్రహ్మాదివరదాయిన్యై నమః ।
ఓం స్వరూపిణ్యై నమః । 70
ఓం సురాణాం అభయప్రదాయై నమః ।
ఓం వరాహదేహసంభూతాయై నమః ।
ఓం శ్రోణీ వారాలసే నమః ।
ఓం క్రోధిన్యై నమః ।
ఓం నీలాస్యాయై నమః ।
ఓం శుభదాయై నమః ।
ఓం అశుభవారిణ్యై నమః ।
ఓం శత్రూణాం వాక్‍స్తంభనకారిణ్యై నమః ।
ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః ।
ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః । 80
ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః ।
ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః ।
ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః ।
ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః ।
ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః ।
ఓం సర్వశత్రుక్షయంకర్యై నమః ।
ఓం సర్వశత్రుసాదనకారిణ్యై నమః ।
ఓం సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః ।
ఓం భైరవీప్రియాయై నమః ।
ఓం మంత్రాత్మికాయై నమః । 90
ఓం యంత్రరూపాయై నమః ।
ఓం తంత్రరూపిణ్యై నమః ।
ఓం పీఠాత్మికాయై నమః ।
ఓం దేవదేవ్యై నమః ।
ఓం శ్రేయస్కర్యై నమః ।
ఓం చింతితార్థప్రదాయిన్యై నమః ।
ఓం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః ।
ఓం సంపత్ప్రదాయై నమః ।
ఓం సౌఖ్యకారిణ్యై నమః ।
ఓం బాహువారాహ్యై నమః । 100
ఓం స్వప్నవారాహ్యై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం సర్వారాధ్యాయై నమః ।
ఓం సర్వమయాయై నమః ।
ఓం సర్వలోకాత్మికాయై నమః ।
ఓం మహిషాసనాయై నమః ।
ఓం బృహద్వారాహ్యై నమః । 108
ఇతి శ్రీవారాహ్యష్టోత్తరశతనామావళిః ।
వారాహి నవరాత్రులు – సందేహాలు
Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా? A) చేయవచ్చు.
Q) బెల్లం పానకం ఏం చేయాలి?
A) తీర్థంలా తాగేయాలి
Q) వారాహీ సహస్రం, కవచం చదవకుండా, మామూలుగా లలితా సహస్రం చదువుతూ , మీరు చెప్పిన శ్లోకాలు చదివి పూజ చేయవచ్చా?
A) చేయవచ్చు
Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా?
A) సాయంత్రం 6 PM కి పూజ ప్రారంభించండి
Q) 9 రోజుల్లో స్త్రీలకి ఇబ్బంది వస్తే?
A) ఇబ్బంది తీరాకా 5 వ రోజు నుంచీ ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు చేయండి
Q) 9 రోజులు కుదరకపోతే?
A) 7 లేక 5 రోజులు కానీ, లేకపోతే ఆఖరి 3 రోజులైనా చేయండి. అవి చాలా ముఖ్యం
Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా?
A) తప్పక పెట్టుకోవచ్చు.
Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా?
A) అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తినండి
Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?
A) రోజూ చదువుకోవచ్చు
Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే అసలు నవరాత్రులు చేయకండి
Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?
A) అవసరం లేదు. (నవరాత్రులు అంత భారంగా బరువుగా అనిపించినప్పుడు అసలు మొదలు పెట్టకండి)
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) ఈ పూజకి కలశం పెట్టే తీరాలా?
A) ఆ నియమం ఏమీ లేదు, మీ ఇష్టం. కలశం లేకపోతే పంచపాత్రకే కలశ పూజ చేసుకోండి
Q) మాంసాహారం మానేయాలా
ఆ) పూజ చేసిన 9 రోజు మానేయండి
Q) పిల్లలూ పూర్వ సువాసినులూ చేయవచ్చా?
A) ఎవ్వరైనా చేయవచ్చు
Q) స్వప్న వారాహీ ఉపాసన అంటే ఏమిటి, ఆ విధానం చెప్పండి?
A) ఆ ఉపాసన చేసి సిధ్ధింపచేసుకుంటే, ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలూ తెలుస్తాయి. అది తెలుసుకోవడం మనలాంటి వాళ్ళకి శ్రేయస్కరం కాదు, అందుకే చెప్పలేదు . అటువంటి విద్యల జోలికి వెళ్ళవద్దు
పై వివరాలన్నీ శ్రీ నండూరి శ్రీనివాస్ గారు తన యూట్యూబ్ చానల్ లో తెలిపినవి. క్రింది లింకు ద్వారా వారి చానల్ కు వెళ్ళవచ్చు .. ఇక్కడ నొక్కండి