ఆదికవి నన్నయ

నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి మరియు వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం (ముగ్గురు కవులు)లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది.

నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటివాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా ఐదు విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ.

ఆదికవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అన్న పేర్లతో ఆయన ప్రఖ్యాతుడయ్యారు.

నన్నయ పసిడి పలుకులు :

“వార్త యందు జగము వర్ధిల్లుచున్నది”

విశ్వశ్రేయ కావ్యం”

“గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్”

నన్నయ గురించిన మిగతా వివరాలు క్రింది లింకులలో లభ్యం

http://www.andhrabulletin.in/AP_AB/andhra_Poets_Nannya.php

http://www.telugudanam.co.in/saahityam/Mana_kavulu.php

https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82_-_%E0%B0%A8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AF_%E0%B0%AF%E0%B1%81%E0%B0%97%E0%B0%AE%E0%B1%81

Leave a Comment