శ్రీ వారాహి నవరాత్రులు 2024 ఎప్పుడు? ఏ విధంగా చేయాలి? పూజా విధానం PDF

వారాహి నవరాత్రులు 2024 లో వారాహీ నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి తెలుసా?ప్రతీ సంవత్సరం ఆషాడ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి. ఈ సంవత్సరం 2024 లో జులై 6 నుంచి 15 వరకు (ఈ సారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి ) జరుపుకుంటారు. లక్షలాది మంది తమ తమ కోర్కెల కోసం ఏంతో భక్తి శ్రద్దలతో .. నిష్టగా ప్రతీ ఏటా చేస్తారు.

ఈ పూజను ప్రతీరోజూ సూర్యాస్తమయం అయ్యాక చేయాలి.

వారాహి నవరాత్రులు జరుపుకోవడం వల్ల ప్రయోజనాలు

ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారికి శుభం, ఐశ్వర్యం, రక్షణ లభిస్తుందని చెబుతారు. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు శుద్దీకరణకు కూడా సమయం. వారాహి భక్తులు పండుగ సమయంలో తరచుగా ఉపవాసం ఉంటారు మరియు వారు ప్రత్యేక పూజలు మరియు ఆచారాలను కూడా నిర్వహిస్తారు.

ఏ వ్యక్తికైనా జీవితములో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము కలుగుతుంది. అలాంటి దృష్టి దోషాలు, దిష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు పిశాచ పీడా భయాందోళనలు వంటివి తొలగడానికి వారాహిమాత పూజ చాలా విశేషమైనది. సమాజంతో కీర్తి కలగడానికి, గుర్తింపు పొందడానికి, అనుకున్న పనులయందు విజయాన్ని పొందడానికి వారాహిదేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన సత్ఫలితాలు పొందవచ్చు.

శ్రీ వారాహి అమ్మవారి పూజా విధానం PDF

వారాహి దేవి 16 నామాలు -శ్రీ వారాహీ షోడశ నామావళిః

ఓం శ్రీ బృహత్ వారాహ్యై నమః
ఓం శ్రీ మూల వారాహ్యై నమః
ఓం శ్రీ స్వప్న వారాహ్యై నమః
ఓం శ్రీ ఉచిష్ట వారాహ్యై నమః
ఓం శ్రీ వార్దలీ వారాహ్యై నమః
ఓం శ్రీ భువన వారాహ్యై నమః
ఓం స్తంభన వారాహ్యై నమః
ఓం బంధన వారాహ్యై నమః
ఓం పంచమీ ప్వారాహ్యై నమః
ఓం భక్త వారాహ్యై నమః | 10 |
ఓం శ్రీ మంత్రిణీ వారాహ్యై నమః
ఓం శ్రీ దండినీ వారాహ్యై నమః
ఓం అశ్వ రూడ వర్హ్యై నమః
ఓం మహిషా వాహన వారాహ్యై నమః
ఓం సింహ వాహన వారాహ్యై నమః
ఓం మహా వారాహ్యై నమో నమః | 16 |

ఇతి శ్రీ వారాహీ షోడశ నామావళిః ||

శ్రీ వారాహి అమ్మవారి చిత్ర పటం – HQ Image

full hd వారాహి దేవి
full hd వారాహి దేవి

 

Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా? A) చేయవచ్చు.

Q) బెల్లం పానకం ఏం చేయాలి?

A) తీర్థంలా తాగేయాలి

Q) వారాహీ సహస్రం, కవచం చదవకుండా, మామూలుగా లలితా సహస్రం చదువుతూ , మీరు చెప్పిన శ్లోకాలు చదివి పూజ చేయవచ్చా?

A) చేయవచ్చు

Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా?

A) సాయంత్రం 6 PM కి పూజ ప్రారంభించండి

Q) 9 రోజుల్లో స్త్రీలకి ఇబ్బంది వస్తే?

A) ఇబ్బంది తీరాకా 5 వ రోజు నుంచీ ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు చేయండి

Q) 9 రోజులు కుదరకపోతే?

A) 7 లేక 5 రోజులు కానీ, లేకపోతే ఆఖరి 3 రోజులైనా చేయండి. అవి చాలా ముఖ్యం

Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా?

A) తప్పక పెట్టుకోవచ్చు.

Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా?

A) అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తినండి

Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?

A) రోజూ చదువుకోవచ్చు

Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?

A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే అసలు నవరాత్రులు చేయకండి

Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?

A) అవసరం లేదు. (నవరాత్రులు అంత భారంగా బరువుగా అనిపించినప్పుడు అసలు మొదలు పెట్టకండి)

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?

A) చేయకూడదు

Q) ఈ పూజకి కలశం పెట్టే తీరాలా?

A) ఆ నియమం ఏమీ లేదు, మీ ఇష్టం. కలశం లేకపోతే పంచపాత్రకే కలశ పూజ చేసుకోండి

Q) మాంసాహారం మానేయాలా

ఆ) పూజ చేసిన 9 రోజు మానేయండి

Q) పిల్లలూ పూర్వ సువాసినులూ చేయవచ్చా?

A) ఎవ్వరైనా చేయవచ్చు

Q) స్వప్న వారాహీ ఉపాసన అంటే ఏమిటి, ఆ విధానం చెప్పండి?

A) ఆ ఉపాసన చేసి సిధ్ధింపచేసుకుంటే, ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలూ తెలుస్తాయి. అది తెలుసుకోవడం మనలాంటి వాళ్ళకి శ్రేయస్కరం కాదు, అందుకే చెప్పలేదు . అటువంటి విద్యల జోలికి వెళ్ళవద్దు

పై వివరాలన్నీ శ్రీ నండూరి శ్రీనివాస్ గారు తన యూట్యూబ్ చానల్ లో తెలిపినవి. క్రింది లింకు ద్వారా వారి చానల్ కు వెళ్ళవచ్చు .. ఇక్కడ నొక్కండి