ఈ వెబ్సైట్ ఎందుకు?

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. ఇంత మంది మాట్లాడే భాష తెలుగు ప్రజల మాతృభాష కావడం ఆనందదాయకం. తెలుగు పలుకుబడి, నుడి, నానుడి వినసొంపుగా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత్వానికి తీసిపోని భాషలో మాట్లాడతారంటే అతిశయోక్తి కాదు.

   bapu-telugu   తెలుగు భాష ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతూ వస్తోంది. సాంకేతిక, శాస్త్రియ భాష పదజాలాన్ని కూడా సృష్టించుకుంటోంది. ఇతర భాషా పదజాలాన్ని తనలో జీర్ణం చేసుకోవడం ద్వారా తెలుగు భాష విస్తరిస్తోంది. అనంతమైన పదజాల సృష్టి జరుగుతోంది. తెలుగు భాషా ప్రియులకు ఆ విశాల దృక్పథం ఉంది. తెలుగు భాష అంతరించిపోతుందనే ఆందోళున తెలుగు సమాజంలో గత కొద్ది కాలంగా జరుగుతోంది. అయితే, నిత్య పరిణామశీలమైన తెలుగు భాష ఎప్పటికీ సజీవంగానే ఉఁటుందనే విశ్వాసం దాని విస్తృతిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు కవిత్వం ఎల్లలు దాటుతోంది. తెలుగు సాహిత్యం, తెలుగు కళలు సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి.

ఈ వెబ్సైట్ లో తెలుగు సాహిత్యానికి, చరిత్రకు సంబంధించిన అనేక విషయాలతో పాటూ, తెలుగు అభివృద్ధికి పాటుపడిన/పాటుపడుతున్న వ్యక్తులు, తెలుగు బ్లాగులు, వార్తలు, సాంస్కృతిక కార్యక్రమాల విశేషాలు ఉంటాయి . అలాగే ముఖ్యంగా ఇంతకూ ముందు ఉండి ఇప్పుడు మూతపడిన, మరుగున పడిన తెలుగు సాహితీ వెబ్సైట్ల నుండి సేకరణలు ఉంటాయి .

ఈ వెబ్సైట్ మీకు ఉపయోగపడిన పక్షంలో పదిమందికీ చేరవేయమని విజ్ఞప్తి. దీనికై మీరు మీ మీ బ్లాగులలో, వెబ్ సైట్లలో మద్దతు పలుకండి  పేజి ద్వారా బొత్తాం కలుపుకోగలరు.

ఈ వెబ్సైట్ లోని అంశాలు చాలా మటుకు ఎక్కడినుంచో సేకరించినవే. వీటిని ఏ వ్యాపార కార్యకలాపాలకోసం వినియోగించడం జరుగదు. అలాగే వీటిని చదివినవారు వీటిని తెలుగు భాష అభివృద్ధి కోసం, ప్రచారం కోసం వినియోగించాలి తప్ప ధన సంపాదన కోసం కాదు . ఈ అంశాలు ఎక్కడి నుండి తీసుకోబడినవో వారికి కృతజ్ఞతలు, వాటి లింకులు  ఆయా టపాలవద్దనే ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కోసారి తెలిసో, తెలీకో వారిని విస్మరించడం జరిగింది. దీనికి మీరు నొచ్చుకోకుండా మా దృష్టికి తెచ్చినట్లయితే సవరించడం జరుగుతుంది . మీ కాపీరైట్ కు భంగం కలిగిన అంశాలు ఉన్నట్లయితే మా దృష్టికి తెండి . వాటిని తొలగిస్తాం.

చివరిగా – మీరు కూడా మా ఈ కార్యక్రమంలో భాగస్వామి కండి. ఇప్పటికే ప్రచురించబడ్డ వ్యాసాలూ, అంశాల లింకులు పంపితే వాటిని క్లుప్తంగా తెలుపుతూ మీ వెబ్ సైట్ కే లింక్ చేయడం జరుగుతుంది.

మీ

శ్రీనివాస్

శోధిని

Leave a Comment