గోవత్సం!

గోవత్సం!
‘వాడి గురించి చెప్పకు… వాడుత్త గోవత్సం’
‘గోవత్సంలా బతికాడు… సొంతంగా ఏమీ తెలియదు’ ఇలాంటి మాటలు వింటుంటాం.
కొందరు తల్లి చాటు బిడ్డలా పెరుగుతారు. పూర్తిగా తల్లి మీదే ఆధారపడతారు.
ఏ పని చేయాలన్నా, చివరికి ఏ విషయమైనా ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాలనుకున్నా కూడా అమ్మ జపమే చేస్తారు. ఇలాంటి అమ్మ కూచులను ‘గోవత్సం’ అంటారు.
గోవు అంటే ఆవు.
వత్సం అంటే దూడ.
రెండిటినీ కలిపి ‘గోవత్సం’ అంటారు.
ఆవుదూడలు అమ్మకానికి వచ్చినప్పుడు… ‘ఆవు ధర’, ‘దూడ ధర’ అని ప్రత్యేకంగా ఉండవు.
ఆవు ధర లేదా విలువే దూడ ధర, విలువ అవుతుంది.
అంతే తప్ప… ఆవుకు ఒక ధర, విలువ దూడకు ఒక ధర, విలువ  అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఈ నేపథ్యంలో నుంచి వచ్చిందే ‘గోవత్సం’ జాతీయం.

సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి

 

Leave a Comment