తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలి

తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన అగత్యం ప్రస్తు తం ఏర్పడిందని ప్రముఖులు పేర్కొన్నారు. వైజ్‌మెన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో ‘హెరిటేజ్‌ ఆఫ్‌ తెలుగు కల్చర్‌’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రముఖులు పూర్ణచంద్రరావు, శంకర్‌రెడ్డి, నటి రమ్యానాయుడు, హషన్‌ తదిత రులు తెలుగు సంస్కృతి వైభవం గురించి మా ట్లాడారు. కార్యక్రమ అధ్యక్షుడు వైఎస్‌ ఆర్‌ మూర్తి మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి, భాష కు సేవ చేస్తున్న జర్నలిస్టులను, కళాకారులను సత్కరించటం తమ సంస్థ కార్యక్రమాల్లో ప్రధానమన్నారు. ఎఎస్‌ఎస్‌శాస్త్రి ఉగాది సత్కారానికి ఎంపికైన వారిని పరిచయం చేశారు. అనం తరం ఆర్వీరమణ, ఆర్‌ రవిశర్మ, నటి ఆర్చన, కవి వి.రఘువీర్‌ ప్రతాప్‌లకు ఉగాది పురస్కారాలు బహుకరించారు.

Leave a Comment