మలేషియాలో తెలుగు సేవ సంతోషకరం : మండలి బుద్ధ ప్రసాద్‌

మలేషియాలో తెలుగు వారు ప్రత్యేక పాఠశాలల ద్వారా తెలుగు భాషకు చేస్తున్న సేవలు మరువలేనివని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ బుద్ధప్రసాద్‌ కొనియాడారు. మలేషియాలో మారుమూల ప్రాంతమైన లాగనదత్త గ్రామంలో తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆయా గ్రామాల్లో తెలుగుబోర్డులను ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మలేషియా తెలుగు సంఘం వ్యవస్థాపకులు సోమినాయుడు, అప్పలనాయుడు, జీవి శ్రీరాములు పాల్గొన్నారు.