నాసాలో మెరిసిన తెలుగు తేజం రత్నకుమార్ బుగ్గ

bugga-ratnakumarనాసా తలపెట్టిన ఇన్నోవేటివ్ అడ్వాన్స్ డ్  కాన్సెప్ట్స్ అనే కార్యక్రమానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, తెలుగు తేజం రత్నకుమార్ బుగ్గ పంపిన ప్రతిపాదనలు సెలెక్ట్ అయ్యాయి. కాలిఫోర్నియాలోని జెట్ ప్రపల్సన్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న రత్నకుమార్ కు తొమ్మిది నెలలపాటు లక్ష డాలర్లు  తన రీసెర్చ్ కు అందించనుంది నాసా. రత్నకుమార్ తో పాటు మరో 13 మంది రీసెర్చ్ కు సెలెక్ట్ అయ్యారు. ప్రాథమిక అధ్యయనంలో విజయవంతమైతే రెండో దశ అధ్యయనానికి నాసా 5 లక్షల డాలర్లు రెండేళ్లపాటు ఇవ్వనుంది. ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు నుంచి ఎలక్ట్రో కెమిస్ట్రీ విభాగంలో రత్నకుమార్ పీహెచ్ డీ పట్టా పొందారు. ప్రస్తుతం  మార్స్ గ్రహానికి సంబంధించి  జరుగుతున్న పరిశోధనల టీమ్ కు రత్నకుమార్ నాయకత్వం వహిస్తున్నారు.

Link:V6 News

Leave a Comment