శోధిని గురించి

మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. “దేశబాషలందు తెలుగులెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. భారత దేశంలో హిందీకి పలు రాష్ర్టాలు ఉన్నాయి, కేవలం తెలుగు భాషకు మాత్రమే రెండు రాష్ర్టాలు ఉన్నాయి. మనం భాషను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు బాషను కాపాడుకుంటే మన ఉనికిని కాపాడుకున్నట్లే. దేశంలో హింది తర్వాత ఎక్కువ మంది మాట్లాడేది తెలుగు భాషే కానీ ఈ రోజున ప్రపంచీకరణలో ఇంగ్లీషు భాష కూడా చాలా ముఖ్యంగా తయారైంది. అయితే ఇది కేవలం మన ఉద్యోగ అవసరానికి మాత్రమే ఉపయోగపడుతుంది. భాష అనేది మన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని కాపాడుకోడానికి చాలా అవసరం.
తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా అందరిదీ ఒకటే జాతి .. అది తెలుగుజాతి. రెండువేల అయిదువందల సంవత్సరాల ఘనమైన చరిత్రగల మహోన్నత జాతి మన తెలుగు జాతి.

తెలుగు భాష చక్కని పలుకుబడులకు, నుడికారములకు పుట్టినిల్లు. కవితల అల్లికలలోని నేర్పు కేవలం తెలుగులోనే సాధ్యం.
మన జాతి, చరిత్ర, భాష, సంస్కృతుల ఔన్నత్యాన్ని మరచి పోతున్న ప్రస్తుత తరాన్ని జాగృతం చేయడం, వాటి ప్రాచీనతను, గొప్పతనాన్ని మన జీవనవిధానంలోని విశిష్టతను తెలియజేస్తూ ఆత్మౌన్నత్యభావాన్ని పెంపొందించుకుని ‘నేను తెలుగువాడిని’అని సగర్వంగా ప్రపంచంలో ఏ మూలనైనా ప్రకటించుకొనేలా చేయడానికి కావలసిన స్ఫూర్తిని, సమాచారాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించటానికి కృషి చేద్దాం.
రండి చేయి చేయి కలుపుదాం. మన తెలుగు భాష మాధుర్యాన్ని, మన తెలుగు జాతి గొప్పదనాన్ని దశ దిశలా చాటుదాం.