పావులూరి మల్లన

పావులూరి మల్లన: పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నయ కాలంనాటివాడని, కాదు నన్నెచోడుని కాలం వాడని వాదాలున్నాయి. పావులూరి మల్లన భీమకవికి సమకాలికుడు. ఇతను శివ్వన్న అను అతనికి కుమారుడు. భీమకవి సవతి తల్లులలో ఒకామెకి ఈ శివ్వన్న తోబుట్టువని మలయమారుత కవీంద్రునిచే రచించబడిన “నీతి శాస్త్రము”లో వ్రాయబడింది. పావులూరి మల్లన గణితశాస్త్రములో మిక్కిలి పండితుడు. “పావులూరి గణితము” అనే పేరుతో గణితశాస్త్రమున ఒక పుస్తకం రచించాడు. … Read more

నారాయణ భట్టు

నన్నయ సమకాలికునిగా ప్రసిద్దుడైన నారాయణ భట్టు 11వ శతాబ్దం వాడు . ఈయనకు కరీభ వజ్రాంకుడు అనే బిరుదు కలదు. ఈయన బహు భాషా కోవిడునిగాను, ఉద్దండ పండితునిగాను పేరు తెచ్చుకున్నాడు. ఇతని పాండిత్యాన్ని గుర్తించి రాజరాజ నరేంద్రుడు నందంపూడి దాన శాసనాన్ని లిఖింపజేసి ఆ అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు . ఈ శాసనమే భట్టు గురించిన పూర్తి వివరాలు తెలియజేస్తుంది. క్రీ.శ.1022 నుండి 1063వరకు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని వెంఘీ దేశాన్ని పాలించిన తూర్పుచాళుక్య చక్రవర్తి … Read more

ఆదికవి నన్నయ

adikani nannaya

నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి మరియు వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం (ముగ్గురు కవులు)లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద … Read more