గువ్వకుత్తుక! : మన జాతీయాలు

కొందరు చూడడానికి చాలా ధైర్యవంతుల మాదిరిగా కనిపిస్తారు. తీరా ఏదైనా కష్టం వస్తే మాత్రం… గొంతు స్వభావమే మారిపోతుంది… బలహీనమై వినిపిస్తుంది’’ ‘‘నిన్నటి వరకు పులిలా ఉన్నాడు. ఈరోజు కష్టం రాగానే గువ్వకుత్తుక అయ్యాడు’’ అంటారు. గువ్వ అనేది అడవి పావురం. ఇది చూడడానికి బలంగా ఉంటుంది. కానీ దాని గొంతు మాత్రం బలహీనంగా ఉంటుంది. ఆపదలో ఉన్నవారు అరిచినట్లుగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పుట్టిన జాతీయమే గువ్వ కుత్తుక.

సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి

Leave a Comment