డల్లాస్ తెలుగు మహాసభలకు నాటా భారీ ఏర్పాట్లు

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న డల్లాస్ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జరగునన్న మహాసభల్లో ఉత్తర అమెరికా నుంచే కాకుండా.. కెనడా, ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని నాటా ప్రతినిధులు తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్ల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎన్నో వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమానికి డాక్టర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి పర్యవేక్షణలో సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

నాటా అధ్యక్షులు మోహన్ మల్లం, కాబోయే అధ్యక్షులు రాజేశ్వర్ గంగసాని, మహా సభల కన్వీనర్ డాక్టర్ రమణా రెడ్డి గూడూరు, సమన్వయకర్త రామ సూర్యా రెడ్డి, సహ కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డిలు సభ విజయవంతం కావడానికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Comment