హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. ఈయన రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు.
బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. పారశీక వాఞ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం మొదలైనవి ఆయన ఇతర రచనలు.వీరు రచించిన వ్యాసాలు ‘సారస్వత వ్యాస ముక్తావళి’ పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, కృష్ణశతకం, వేంకటేశ్వర సుప్రభాతం, నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశారు. అనువాద రచనలు కూడా చేశారు. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో ‘తెలంగాణ రచయితల సంఘం’ ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యారు.
ఈయన గురించి మరిన్ని వివరాలు క్రింది లింకులలో చదవవచ్చు :