శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం, Subrahmanya Ashtakam in Telugu PDF

Subramanya Ashtakam Karavalamba Stotram in Telugu meaning. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం తెలుగు అర్ధంతో సహా వివరణ 

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ కరావలంబ స్తోత్రం –  Subramanya Ashtakam Karavalamba Stotram

హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

He swaminatha karuṇakara deenabandho, Sriparvateesa mukhapankaja padmabandho |
Srishadhi devagaṇapoojitha paadapadhma, vallisanatha mama dehi karavalambam || 1 ||

హే స్వామినాథా, కరుణాకరా, దీనబాంధవా, శ్రీ పార్వతీశ (శివ) ముఖ కమలమునకు బంధుడా (పుత్రుడా), శ్రీశ (ధనపతి) మొదలగు దేవగణములచే పూజింపబడు పాదపద్మములు కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Devadhi devanutha devaganadhinatha, Devendravandya mrudupankaja manjupadha |
devarshii narada muneendra sugeetakeerthe, Vallisanatha mama dehi karavalambam || 2 ||

దేవాదిదేవుని (శివుడి) సుతుడా, దేవగణములకు అధిపతీ, దేవేంద్రునిచే వందనము చేయబడు మృదువైన పద్మములవంటి పాదములు కలవాడా, దేవ ఋషి అయిన నారద మునీంద్రునిచే సంకీర్తనము చేయబడు ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Nityannadhana nirathakhila rogaharin, tasmath pradhana paripuritha bhakthakaama |
Shruthyagama pranava vachya nijaswaroopa, Vallisanatha mama dehi karavalambam || 3 ||

నిత్యము అన్నదానము చేయువాడా, అఖిల రోగములను హరించుటలో నిమగ్నుడవైనవాడా, తద్వారా భక్తులకోరికలను తీర్చువాడా, శ్రుతులు (వేదములు), ఆగమములయందు చెప్పబడిన ప్రణవానికి నిజమైన స్వరూపము కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Kraunchasurendra parikhaṇḍana saktisoola, pasadisastra parimandita divyapane |
Srikundalisa dhrutathunda sikhindravaha, Vallisanatha mama dehi karavalambam || 4 ||

అసురుల రాజును ఖండించిన శక్తిశూలం, పాశము మొదలయిన శస్త్రములతో అలంకరింపబడిన చేతులుకలిగి, శ్రీకుండలములు ధరించిన నాయకుడా, శిఖీంద్ర (నెమలి) చే మోయబడు ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య, దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Devadideva rathamandala madhya vedya, Devendra peeta nagaraṃ dhrudachaapahastham  |
Sooram nihatya surakoti bhireedyamana, Vallisanatha mama dehi karavalambam || 5 ||

దేవాదిదేవా, రథముల సమూహములో మధ్యలో పరివేష్టితుడవై ఉండువాడా, దేవేంద్రపీఠము ఉన్న నగరములో దృఢంగా విల్లును చేతిలో పట్టుకుని, శూరత్వము కలిగి, సురకోటిచే ప్రశంసింపబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

హారాదిరత్నమణియుక్తకిరీటహార, కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాౙ్మరబృందవంద్య, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Haaradiratna maniyukta kireetahara, keyurakundala lasatkavachabhirama |
he veera taraka jaya marabrunda vandhya, Vallisanatha mama dehi karavalambam || 6 ||

వజ్రము మొదలగు రత్నములతో, మాణిక్యములతో చేయబడిన కిరీటము, హారములు, కేయూరములు, కుండలములు మరియు కవచముతో అందముగా అలంకరింపబడి, వీర తారకుడిని జయించి, దేవతా బృందముచే వందనము చేయబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః, పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

Panchaksharadhi manumantrita gaangatoyaih, panchamrutaih pramuditendramukhairmunindraih  |
pattabishikta hariyukta parasanatha, Vallisanatha mama dehi karavalambam  || 7 ||

పంచాక్షరాది మంత్రములతో అభిమంత్రించిన గంగాజలములతో, పంచామృతములతో, ఆనందముఖముతో ఉన్న ఇంద్రునిచే మునీంద్రులు పట్టాభిషేకము చేసిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా, కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||

Sri Karthikeya Karunamrutha poornadrustya, Kaamadiroga kalushikruta dushtachitham |
bhakthwa tu mamavakaladhara kanthikanthya, Vallisanatha mama dehi karavalambam || 8 ||

శ్రీకార్తికేయా, కరుణామృతము పూర్తిగా కలిగిన దృష్టితో, కామాది రోగములతో కలుషితమైన నా దుష్ట చిత్తమును, నా కళావిహీనమైన కాంతిని నీ కాంతితో చల్లి, ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః , తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్,  కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||

Subrahmanya karavalambam punyam ye patandhi dwijotamah | te sarve mukti mayanthi subrahmanya prasadatah |
Subrahmanya karavalambamidam pratrutthaya yah pateth | Koti janma krutam papam tat kshana deva nasyati ||

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యవంతమైనది. దీనిని యే ద్విజులు పఠించెదరో వారు ముక్తిని సుబ్రహ్మణ్య ప్రసాదము వలన పొందగలరు.

ఈ సుబ్రహ్మణ్యాష్టకమును ఎవరైతే ప్రొద్దున్నే లేవగానే పఠించెదరో, వారి కోటిజన్మలలో చేసిన పాపము తక్షణం నశించును.

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ |

Leave a Comment