వేమన శతకాన్ని ధారణ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అతి తక్కువ వ్యవధిలో వేమన శతక పద్యాలను అవలీలగా ధారణ చేసి అబ్బురపరిచాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్‌లో చిలకా రాహుల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలలో వరల్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు నిర్వాహకుల సమక్షంలో ఎనిమిది నిమిషాల్లో వంద వేమన శతకాల్లో ఏది అడిగినా తడుముకోకుండా వల్లెవేశాడు. రాహుల్ ధారణశక్తిని అరుదైనదిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు గుర్తించి నమోదు చేశారు. Source: … Read more