ఆకాశవాణిలో రసవత్తర రంగస్థల వాణి

16 నుంచి 22 వరకు ఉదయం 9.30 నుంచి 60 నిమిషాలసేపు 7 నాటకాలు ప్రసారం కాబోతున్నాయి. హైదరాబాద్‌లోని నాటకరంగప్రముఖులు రూపొందించిన శ్రీనాథుడు, తర్వాత ‘ఒకే నిద్ర – ఎన్నో కలలు’ ఓ కాశీవాసా రావయ్యా, జగమేమారినది, ఆదిలాబాద్‌ శాలువా, ఇదిగో తోక – అదిగో పులి, బైపాస్‌ వరుసగా ఆలకించొచ్చు.

తెలుగు వెలుగు వారధులను సన్మానించడం అభినందనీయం

telugu

తెలుగు భాషను, ఆధ్యాత్మికతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం కృషి చేస్తున్న మహానుభావులను సన్మానించే కార్యక్రమానికి తాను ముఖ్యఅతిథిగా రావడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌ అన్నారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు సనాతన ధర్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌లోని టివోలీ గార్డెన్‌లో శ్రీరామనవమి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ భవానీ ప్రసాద్‌ … Read more

కెనడాలో ఘనంగా ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ కల్గేరి’ ఉగాది వేడుక

telugu-canada

కెనడాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ కల్గేరీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 100కు పైగా తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. సాంప్రదాయ వస్త్రధారణలో అందరూ వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనిత కదం, మేఘన గుల్గోట ప్రదర్శించిన అర్ధనారీశ్వర నాట్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పంచాంగ శ్రవణాన్ని అందరూ శ్రద్ధగా ఆలకించారు. భరత నాట్యం, అంత్యాక్షరి తదితర కార్యక్రమాలు అలరించాయి. వేడుకలను ఇంత ఘనంగా … Read more