Kanakadhara Stotram in Telugu – కనకధారా స్తోత్రం
వందే వందారు మందారమిందిరానందకందలమ్ ।
అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥
నిరంతరము మ్రొక్కు స్వభావము గల భక్తులకు సాథకులకు కల్పవృక్షము వంటివాడు. అఖండాద్వయానన్ద అవస్థయందున్నవాడు. శ్రీదేవికి ఆనన్దకారకుడు అయిన సిన్ధురాననునకు (గణపతికి నమస్కరించుచున్నాను.
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥
పులకాలంకృతమైన శ్రీహరి శరీరమును ఆడు తుమ్మెద మొగ్గలచే అలంకృతమైన తమాలవృక్షమునువలె ఆశ్రయించియున్నదై, సకలైశ్వర్యములను శరీరముగాఁ జేసికొన్న మంగళదేవతయైన శ్రీ మహాలక్ష్మీ క్రీగంటి చూపు నాకు మంగళపరంపర నిచ్చునది యగుగాక.
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని ।
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥
ముద్దరాలై యెవతె మురారి ముఖమునందు, పద్మమునందు ఆడు తుమ్మెదవలె ప్రేమతో సిగ్గుతో గూడిన మాలాకృతిగల చూపుల రాకపోకలను చేయుచుండునో, అట్టి క్షీరసాగర కన్య చూపులమాల నాకు సంపదల నిచ్చుగాక..
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం-
ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ ।
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥
సంతోషముతో కన్నులు మూతపడి యున్న శ్రీ మావిష్ణుమూర్తిని పొంది, ఆనందమునకు మూలమై రెప్పపాటు లేక మన్మథ పరవశమైన, కొంచెమోరగనున్న నల్లగ్రుడ్లు తెప్పలుగల శేషశాయి యిల్లాలి (శ్రీలక్ష్మీదేవి) చూపు నాకు సంపద నిచ్చునది యగుఁగాక.
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి ।
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥
కౌస్తుభమణి దాల్చిన మధుసూదన దేవుని వక్షస్థలమునందు ఇంద్ర నీల మణిమయ హారముల వరుసవలె నెవలె ప్రకాశించుచున్నదో, భగవంతునకు కోరినకోరికల నిచ్చునట్టి కమలాలయ (లక్ష్మీదేవి) కటాక్షము నాకు మంగళమును కలిగించు గాక.
కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥
కైటభారి (విష్ణుని) నల్లని మేఘమాలవలె అందమైన వక్షస్థలమునందు నీలమేఘమునందు మెఱుపుతీఁగవలె నెవతె మెఱయుచున్నదో, సకల లోకములకు తల్లియైన లక్ష్మీదేవి యొక్క మూర్తి నాకు మంగళముల నిచ్చుఁగాక.
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన ।
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥
ఏ ప్రభావముచే మన్మథుడు (మనస్సు) కల్యాణములను పొందెడి విష్ణువునందు ప్రసిద్ధమైన స్థానమునాక్రమించెనో, అట్టి మథించు స్వభావముకల ప్రకాశములేక నిద్రించునట్లుండెడి లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు నాయందు ప్రసరించుగాక !
విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి ।
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥
సకల దేవరాజులకు వారివారి పదవీ విలాసముల నిచ్చుటకు సమర్థమైనది, మురారికిని విశేషముగ ఆనందకారణమైన పద్మగర్భసోదరమైన లక్ష్మీదేవి సగముచూపు కొంచెముగా నామీద ప్రసరించుగాక.
ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే ।
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 8 ॥
లక్ష్మీదేవి యొక్క దయార్ద్ర దృష్టి వలన (అ) విశిష్టమతులు సులభముగా స్వర్గమును పొందుచున్నారు. అటువంటి శ్రీయొక్క బాగుగా వికసించిన పద్మ కర్ణికాతుల్య ప్రకాశం వంటి చూపు, నాకు హితమైన పుష్టిని కలిగించు గాక !
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-
మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే ।
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥
లక్ష్మీదేవి యొక్క దృష్టియనెడు మేమము దయావాయువుచే ప్రేరేపింపబడినదై, చాలా కాలముగా నున్న దుష్కర్మ మనెడు స్వేదమును తొలగించి, ఈ దుఃఖితుడైన దరిద్రుడను చేతక శిశువునందు ధన వర్షధార ఒసంగు గాక !
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి ।
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥
వాణిగా, గరుడధ్వజుని భార్యగా, శాకంభరిగా, శశిశేఖర వల్లభగా సృష్టి స్థితి లయములను క్రీడలో బాగుగా నిలిచియున్నటు వంటి; త్రిభువనములకు గురువైన పరమాత్మకు అర్థాంగియగు పరాశక్తి కొరకు నమస్కారము.
శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై ।
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 11 ॥
పుణ్యకర్మల ఫలము ననుగ్రహించు శ్రుతి రూపిణి, మనోహరగుణ సముద్రయైన రతిరూపిణి, శతపత్ర పద్మ నివాసినియగు శక్తిరూపిణి అగు పరమపురుషుని ఇల్లాలైన పుష్టిరూపిణియైన లక్ష్మికి నమస్కారమగు గాక !
నమోఽస్తు నాళీకనిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై ।
నమోఽస్తు సోమామృతసోదరాయై
నమోఽస్తు నారాయణవల్లభాయై ॥ 12 ॥
పద్మమువంటి ముఖము కలదియు, క్షీర సాగరము జన్మభూమిగా కలదియు; చన్ద్రునకు, అమృతునకు (ధన్వంతరికి) సహోదరియు అగు నారాయణికి నమస్కారము.
నమోఽస్తు హేమాంబుజపీఠికాయై
నమోఽస్తు భూమండలనాయికాయై ।
నమోఽస్తు దేవాదిదయాపరాయై
నమోఽస్తు శారంగాయుధవల్లభాయై ॥ 13 ॥
నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై ।
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥
నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై ।
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజవల్లభాయై ॥ 15 ॥
సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి ।
త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ॥ 16 ॥
పద్మలోచనయైన తల్లీ! పూజ్యురాలా! సంపదలు కలిగించునవి, సకలేంద్రియములను సంతసింపజేయునవి, సామ్రాజ్యము నిచ్చు. వైభవముగలవి, పాపములను సమూలముగా పోగఁట్టుట కుద్యుక్తములైనవి అగు నీ నమస్కారములు ఎల్లప్పుడు నాకే లభించు గాక!
యత్కటాక్షసముపాసనావిధిః
సేవకస్య సకలార్థసంపదః ।
సంతనోతి వచనాంగమానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే ॥ 17 ॥
ఏ తల్లి క్రీగంటి చూపునారాధించుట సేవకునకు సకల పురుషార్ధ సంపదలను సమృద్ధముగఁ గలిగించునో, అట్టి మురారి హృదయేశ్వరివైన నిన్ను వాక్కాయమానసములతో సేవించెదను.
సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 18 ॥
పద్మాలయా ! పద్మహస్తా! తెల్లని వస్త్రముల, గంధములు, పూల మాలల కాంతిగలదానా ! మూఁడులోకములకు నైశ్వర్యము కలిగించుదానా! భగవతీ | విష్ణు ప్రియా। మనోహారిణీ। నాయెడ ప్రసన్నమగుము.
దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ ।
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ ॥ 19 ॥
ిగ్గజములచే బంగారు కలశములనుండి వంచబడిన ఆకాశగంగ యందలి విమల జలములచే స్నానముచేయింపఁబడిన యొడలు గల్గి క్షీర సాగరపుత్రియైన, అశేషలోక ప్రభువైన శ్రీహరి కిల్లాలైన జగజ్జననిని ప్రాతస్సమయమున నమస్కరింతును.
కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితైరపాంగైః ।
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 20 ॥
లక్ష్మీదేవి | పుండరీకాక్షుని ప్రేయసీ। నీవు దయాప్రవాహ తరంగి బలైన క్రీగంటిచూపులతో, దరిద్రులలో అగ్రగణ్యుఁడను, నీ దయకు కల్లకపట మెఱుఁ గని ముఖ్యపాత్రమనైన నన్ను చూడుము.
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ।
గుణాధికా గురుతరభాగ్యభాగినో
భవంతి తే భువి బుధభావితాశయాః ॥ 21 ॥
వేదత్ర స్వరూపిణియై, త్రిలోకమాతయైన లక్ష్మీదేవిని అనుదినమును ఎవరీస్తుతులతో స్తుతించెదరో, వారు సద్గుణాధికులై, విస్తారమయిన భాగ్యమును పొందువారై యీ భూమిమీఁద విద్వాంసులు మననము చేయు ఆశయములు గలవారలగుచున్నారు.
సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ ।