శ్రీ మదాంధ్ర మహాభారతం (కవిత్రయ విరచిత) Mahabharatam in Telugu Full PDF

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతం గంధాన్ని ప్రచురించారు. మొత్తం 18 పర్వాలను 15 సంపుటాలుగా ముద్రించారు.  క్రీడి లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

Download Mahabharatam in Telugu Written by Nannaya, Tikkana, Errana

క్ర. సంఖ్యపర్వంఅంశాలుఆంధ్ర భారతంలో పద్య గద్య సంఖ్యఆంధ్ర భారతంలో
ఆశ్వాసాల సంఖ్య
డౌన్లోడ్ లింకు
1ఆది పర్వముతక్షశిలలో (ఆధునిక తక్షశిల (పాకిస్థాను) ) జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం తరువాత వైశంపాయనుడు భారతం వినిపించిన తరువాత నైమిశారణ్యంలో ఋషులందరూ వినుచుండగా సూతుడు భారతకథను ప్రసంగించాడు. కురు వంశానికి మూలమైన భరత, భృగువంశాల వంశవృక్షాలు వివరించబడ్డాయి (ఆది అంటే మొదటి).2,0848Click Here (Part-1)

Click Here (part-2)

2సభా పర్వముదానవుడైన మయుడు ఇంద్రప్రస్థ వద్ద రాజభవనం, సభామండపం నిర్మించాడు. యుధిష్టరుడి సభలో జీవితం, రాజసూయ యాగం. మాయాజూదం ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల వనవాసం ఇందులో వర్ణించబడింది.6182Click Here
3వన పర్వం లేదా అరణ్యపర్వం12 సంవత్సరాల పాండవుల అరణ్యవాసం. (అరణ్య)2,8947Click Here
4విరాట పర్వమువిరాటరాజు సభలో పాండవులు ఒక సంవత్సరకాలం గడుపిని వివరం వర్ణించబడింది.1,6245Click Here
5ఉద్యోగ పర్వముపాండవులు, కౌరవుల మద్య నిర్వహించబడిన విఫలమైన సంధిప్రయత్నాలు, యుద్ధానికి సన్నద్ధం జరగడం. (ఉద్యోగఅంటే పనిచేయడం).1,5624Click Here
6భీష్మ పర్వముభీష్ముడు కౌరవుల పక్షం సైన్యాధ్యక్షుడుగా యుద్ధం మొదటి భాగం. భీష్ముడు అంపశయ్య మీద పడిపోవడం, (ఇందులో గీతోపదేశం 25-42 అధ్యాయాలలో) వర్ణించబడింది.[26][27]1,1713Click Here
7ద్రోణ పర్వముద్రోణుడి సారథ్యంలో కొనసాగిన యుద్ధం. ” బుక్ ఆఫ్ వార్ ” పుస్తకంలో ఇది ప్రధానమైనది. ఈ పుస్తకం చివరిలో ఇరుపక్షాలలో మహావీరులలో అనేకులు యుద్ధం కారణంగా మరణించారు.1,8605Click Here
8కర్ణ పర్వముకౌరవపక్షంలో కర్ణుడి సారథ్యంలో కొనసాగిన యుద్ధం.1,1243Click Here
9శల్య పర్వముకౌరవపక్షంలో శల్యుని సారథ్యంలో కొనసాగి ముగిసిన యుద్ధం చివరి రోజు. ఇందులో సరస్వతీ నదీతీరంలో బలరాముడి యాత్ర, భీముడు, దుర్యోధనుల మద్య యుద్ధం, భీముడు దుర్యోధనుడి తొడలు విరచుట.8272Click Here
10సౌప్తిక పర్వముఅశ్వమేధ పర్వము కృపాచార్యుడు, కృతవర్మ మిగిలిన పాండవుల సైన్యాలను నిద్రపోతున్న సమయంలో వధించడం. కౌరవుల వైపు 3, పాండవుల వైపు 7 మంది మిగిలి ఉన్నారు.3762
11స్త్రీ పర్వముగాంధారి, కౌరవ స్త్రీలు, పాండవులు యుద్ధంలో మరణించిన వారిని గురించి ధుఃఖించుట. గాంధారి శ్రీకృష్ణుడిని శపించుట.3762
12శాంతి పర్వముచక్రవర్తిగా యుధిష్ఠరుడి పట్టాభిషేకం. భీష్ముడి నుండి ధర్మరాజాదులు ఉపదేశాలు గ్రహించుట. ఆర్థిక, రాజకీయాల గురించి అనేక విషయాలు చర్చించబడిన ఈ పుస్తకం మహాభారతంలో సుదీర్ఘమైనది. ఈ పుస్తకంలో తరువాత చొరబాట్లు అధికంగా జరిగాయని ” కిసారి మోహను గంగూలి ” అభిప్రాయపడ్డాడు.3,0936Click Here
13అనుశాసనిక పర్వముభీష్ముడు చెప్పిన ది ఫైనల్ ఇంస్ట్రక్షంసు (అనుశాసన).2,1485Click Here
14అశ్వమేథ పర్వము [28]యుధిష్టరుడు నిర్వహించిన అశ్వమేథయాగం. అర్జునుడి విజయయాత్ర. అర్జునుడికి శ్రీకృష్ణుడు అనుగీత బోధించుట.9764Click Here
15ఆశ్రమవాస పర్వముధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అంతిమయాత్ర. (సజీవంగా కార్చిచ్చులో పడి కాలిపోయి మరణించారు). విదురుడు యోగిగా శరీరయాత్ర ముగించి ధర్మరాజులో ప్రాణాలను విలీనం చేయుట. తమతో ఉన్న సంజయుడిని హిమాలయాలకు పోయి ప్రాణాలను రక్షించుకొమ్మని ఆఙాపించుట.3622
16మౌసల పర్వముగాంధారి శాపఫలితంగా యాదవులు అంతర్యుద్ధం చేసుకుని మౌసలం (ముసలం) కారణంగా మరణించుట.2261
17మహాప్రస్థానిక పర్వముయుధిష్టరుడు తన సోదరులు, భార్య ద్రౌపదితో సుదీర్ఘమైన అంతిమయాత్రతో జీవనయాత్ర ముగించుట. ఇందులో యుధిష్టరుడు మినహా అందరూ శరీరాలు చాలించగా, యుధిష్టరుడు సశరీరుడుగా స్వర్గలోకం చేరుకుంటాడు.791
18స్వర్గారోహణ పర్వముయుధిష్టరుడు చివరి పరీక్ష తరువాత స్వర్గంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించుట.971
హరివంశ పర్వము / భవిష్య పర్వం18 పర్వాలలో చెప్పబడని శ్రీకృష్ణుడి గురించి వివరించుట.
మొత్తం21,50763