సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి అమెరికా ప్ర‌భుత్వం అనుమతి

siliconandhra university

సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి అమెరికా ప్ర‌భుత్వం అన్ని అనుమ‌తులు ఇచ్చింది. భారతీయ క‌ళ‌లు, కూచిపూడి, క‌ర్ణాట‌క సంగీతంలో డిప్లోమా, డిగ్రీ స్థాయిల్లో కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు రాజ‌ముద్ర పడింది. ఈ కోర్సుల్లో ప‌ట్టాలు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభ‌మైన సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి కాలిఫోర్నియా రాష్ట్రంలో అనుమ‌తులు ల‌భించాయి. 12వ త‌ర‌గ‌తి పాసైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేర‌డానికి అర్హులు. భార‌త‌దేశం బ‌య‌ట తొలిసారిగా భార‌తీయ క‌ళ‌ల‌ను గుర్తిస్తూ ఆ క‌ళ‌ల‌కు ప‌ట్టం క‌ట్ట‌డంలో సిలికానాంధ్ర విజ‌యం సాధించింది. ఇలా భార‌తీయ … Read more

తెలుగు భాష విశిష్టమైనది : మలేషియాలో ఉగాది సంబురాల్లో ఎంపీ కవిత

తెలుగులోని కస్తూరి వాసన చక్కర పాకం.. అరవ భాషలోని అమృతరాశి.. కన్నడంలోని కస్తూరి వాసన..అంటూ ఇతర భాషల్లోని గొప్పదనాన్ని తనలో ఇమిడింపజేసుకున్న గొప్పదనం తెలుగుభాషది అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో మలేషియా తెలుగు సంఘం ఉగాది సంబురాలను శనివారం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత తెలుగుభాష గొప్పదనాన్ని, విశిష్టతను ఇలా కవిత రూపంలో వినిపించారు. మలేషియాలోని తెలుగు వారందరికీ దుర్మిఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ … Read more

ఈ వెబ్సైట్ ఎందుకు?

bapu-telugu

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. … Read more

ఉగాది నాడు మండుటెండలో తెలుగుతల్లి ఆవేదన దీక్ష చేసిన యార్లగడ్డ

yarlagadda

తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ హిందీ, తెలుగు పండితుడు, విద్యావేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవేదన దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మండుటెండలో ఆయన ఆవేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పుష్కరాల ముగింపు ఉత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానం చేతల్లో ఇంతవరకు అమలు చేయకపోవటం బాధాకరమని అన్నారు. … Read more

ఉగాది…

ugadi-pachchadi

ఉగస్య ఆది ఉగాది … ఉగ అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ’ఆది’ ’ఉగాది’ అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. తత్రచైత్రశుక్ల చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది ‘ఉగాది’గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు. ఉగాది పండుగ … Read more

“దేశ భాషలందు తెలుగు లెస్స”

bapu-telugu

ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, అంతా కొత్తే…..భాష రాదు , మన ప్రాంతం కాదు . అప్పుడు ఎక్కడినుంచో ఒక తెలుగు మాట వినిపిస్తే మన కెంత సంతోషంగా వుంటుంది..ఎడారిలో ఒయాసిస్సు చూసినట్టు వుండదూ? అదే నండి ఒక భాష గొప్పతనం..మాతృ భాష అంటే మన ఉనికి, మన వ్యక్తిత్వం.ఫెబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో వారు గుర్తించారు.అందుకని ఈ రోజు ఒకసారి మన తేనెల తేటల తెలుగు బాష గురించి చూద్దాం. ఇంకా చదవండి

ఊటుకూరు భూదేవి

ఊటుకూరు భూదేవి

పాశ్చాత్య వ్యామోహంలో పడి తెలుగు భాష అంతరించి పోకూడదు. పదికాలాల పాటు మనగలగాలి అని ఆశించే వారిలో ప్రధమురాలు భూదేవి. కళామైత్రి సంస్థను స్థాపించి తెలుగు భాషా సంస్కృతి ప్రచారంలో భాగంగా శతకామృతవర్షిణి పేరిట నాటి కవులు రచించిన పలు శతకాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని గొంతెత్తి ఆమె తన పాటల ద్వారా అనేక ప్రదర్శనలిచ్చి తద్వారా తన వంతుగా తెలుగుతల్లికి నీరాజనాలర్పిస్తున్నారు. ఇంకా చదవండి

బూర్గుల రామకృష్ణారావు

burgula_ramakrishanarao

హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. ఈయన రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు. బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. పారశీక వాఞ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం మొదలైనవి ఆయన ఇతర రచనలు.వీరు రచించిన … Read more

ఆదికవి నన్నయ

adikani nannaya

నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి మరియు వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం (ముగ్గురు కవులు)లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద … Read more