5000+ Telugu Samethalu తెలుగు సామెతలు Collection

తెలుగు బాషలో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ వ్యక్తీ తన జీవితంలో అనునిత్యం ఎన్నో సామెతలు ఉపయోగిస్తూ ఉంటాడు. సందర్భాన్ని బట్టే కాక ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వర్గాన్ని బట్టి కూడా సామెతలలో వ్యత్యాసం ఉంటుంది. పల్లెల్లో ఉండేవారి సామెతలు హాస్యం గానూ, వేతకారంగానూ ఉంటే పట్టణాలలో ఉండేవారి సామెతలు చాలా మటుకు చివుక్కుమనిపిస్తాయి. తెలుగు బాషలో ఉన్న వేలాది సామెతలలో కొన్ని మీకోసం అందిస్తున్నాం.. వీటిని అక్షర క్రమంలో ఉంచుతున్నాం..

అత్తకొట్టిన కుండ అడుగోటికుండ, కోడలు కొట్టినకుండ కొత్తకుండ.
అత్త చేసిన పనులకు ఆరుళ్ళు లేవు.
అత్త పేరు బెట్టి కూతురిని కుంపట్లో వేసినట్టు.
అత్త మంచి, వేముల తీపు లేదు.
అత్త వల్ల దొంగతనమును, మగనివల్ల రంకును నేర్చుకొన్నట్టు.
అత్తిపండు పగల కొట్టితే అన్నీ పురుగులే.
అత్తి పూచినట్టు.
అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత.
అందము చిందినట్టు, నాగరికము నష్టమయినట్టు.
అంగటి వీధిలో ఆలిని పడుకోబెట్టి వచ్చేవారు పోయేవారు దాటిపోయినారు అన్నట్లు.
అంగట్లో అన్నీ ఉన్నవి, అల్లుని నోట్లో శనివున్నది.
అంగడి అమ్మి గొంగళి కొన్నట్టు.
అంగిట విషము, మున్నాలికన తియ్యదనము.
అంచుడాబే గాని, పంచె డాబు లేదు.
అందులో పసలేదు, గంజిలో వార్చమన్నట్లు.
అంధునకు అద్దము చూపినట్టు.
అంబటికిఆశ, మీసాలకూ ఆశ.
అంబటి యేరు వచ్చినది అత్తగారూ అంటే, కొలబుర్ర నా చేతిలో వున్నది కోడలా అన్నదట.
అంబలి తాగేవారికి మీసాలు యెగబట్టేవారు కొందరా.
అక్కన్న మాదన్నగారు అందలమెక్కితే, సాటికి సరప్ప చెరువు ఎక్కినాడట.
అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం.
అగస్త్య భ్రాత.
అగ్గున అయితే అంగడికి వస్తుంది.
అగ్గువ అయితే అందరూ కొంటారు.
అగ్నికి వాయువు సహాయమయినట్టు.
అటయితే వైద్యకట్నము, ఇటయితే వైతరణీ గోదానము.
అట్లు వండే అత్తకు అరవై ఆరు ఎత్తులు పెట్టినట్లు.
అడక్కుండా చెప్పులిచ్చాడు, అడిగితే గుఱ్ఱ మిస్తాడని అనుకొన్నట్లు.

అడగనేరను పూడ్చి పెట్టమన్నట్లు.
అయితే ఆదివారం, కాకుంటే సోమవారం.
అయ్య దాసండ్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టినది.
అయ్యవారు అటికంత, అయ్యవారి పెండ్లాము పుటికంత.
అయ్యేదాక అరిసెల పాకం, అయిం తరువాత బూరెల పాకం.
అరకాసు పనికి ముప్పాతిక బాడుగ.
అరగ దీసిన గంధపు చెక్కకు వాసన తగ్గునా?
అరచేతి రేగుబంటికి అద్దము కావలెనా ?
అరచేతిలో ఉప్పు పెడితే ఆరు నెలలు తలచుకోవలెను.
అరచేతిలో వైకుంఠము చూపినట్లు.
అరవై ఏండ్లయిన తర్వాత అమ్మా అన్నాడట.
అదృష్టం కలిసొస్తే ఆలు పెండ్లామవుతుంది.
అదుగో అంటే ఆరు నెలలు.
అగ్నిలో మిడత పడ్డట్టు.
అగ్నిహోత్రమునకు పోయిన సోమిదేవమ్మ ఆరునెలల గర్భముతో వచ్చినది.
అచ్చం తిరుమణిధారి అయితే పుల్ల పట్టడంలో తెలుసును.
అటయితే కందిపప్పు, ఇటయితే పెసరపప్పు.
అదును చూసి పొదల్లో చల్లినా పండుతుంది.
అదే పతకమయితే మనము బ్రతకమా?
అద్దము మీద పెసరగింజ పడ్డట్టు.
అంటే ఆరడి అవుతుంది అనకుంటే అలుసవుతుంది.
అందములో పుట్టిన గంధపుచెక్క అముదములో పుట్టిన మడ్డి
అందని పూలు దేవునికి అర్పణ.
అద్దెకు వచ్చిన గుర్రాలు అగడ్తలు దాటుతవా?
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు.
అదృష్టం అందలమెక్కిస్తానంటే, బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందట.
అదృష్టవంతుణ్ణి చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారూ లేరు.
అధమునికి ఆలయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేది మేలు.
అడివి ఉసిరికాయ, సముద్రపు ఉప్పు కలిసినట్టు.
అడుక్కు తినేవానికి అరవై ఊళ్ళు.
అడుగులోనే హంస పాదా
అడ్డగోడమీది పిల్లి.
అధికాశ లోక దారిద్య్రము.
అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది.
అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.
అనుమానం మొగుడు ఆలిని వీపుకు కట్టు కొంటే. పెండ్లాము మిండమగని కొప్పులో బెట్టుకున్నదట.
అన్నము లేకపోతే వరి అన్నము, బట్టలేక పోతే పట్టుబట్ట.
అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయింది.
అన్యాయపురిలో ఆలి మొగుడికి రంకు.
అన్నీ పండించిన రైతుకు అన్నం కరువు.
అప్పిగాడుపోతే అపంచా నాకే, పాపిగాడు పోతే ఆపైపంచా నాకే
అప్పు అక్కరకు వచ్చునా ?
అన్నెం పున్నెం తినడానికి ఆలి తమ్ముడు, మగని తద్దినం పెట్టడానికి మగని తమ్ముడు.
అపనింద అవతలికి పోతే, నింద వచ్చి నెత్తిమీద పడ్డది.
అప్పు దొరికితే పప్పుకూడు.
అప్పు మెప్పు.
అప్పు లేకపోతే ఉప్పుగింజే మేలు.
అప్పుల వాని నమ్ముకొని అంగడికి పోరాదు, మిండని నమ్ముకొని జాతరకు పోరాదు.
అప్పులేని గంజి దొప్పెడే చాలును.
అబద్ధమాడినా గోడ పెట్టినట్టు వుండవలెను.
అబద్ధం చెపితే అన్నం పుట్టదు. నిజం చెబితే నీళ్లు పుట్టవు.
అబద్ధాల నోటికి అరవీసెడు సున్నం కావాలి.
అబ్బ పెంచిన బిడ్డయినా కావాల, అమ్మ పెంచిన బిడ్డయినా కావాల, ముండపెంచిన
బిడ్డ మండలాధిపతి అవుతాడా?
అబ్బిగాడు చస్తే ఆ పంచె నాది.
అబ్బురాన బిడ్డ పుట్టెను. డగ్గపార తేరా చెవులు కుట్టుతాను.
అభ్యాసము లేని రెడ్డి అందలమెక్కితే అటూ ఇటూ అయినదట.
అమర్చినదాంట్లో అత్తగారు వేలు పెట్టినది.
అయితే అరుగు, కాకపోతే కంది.
అయినవారందరు ఆ దోవనుపోగా, జంగాన్ని పట్టుకొని జాము ఏడ్చినాడు.
అయినోడిని అడిగేకంటే, కానోణ్ణి కాళ్ళు పట్టుకొనేది మేలు.
అయినవారు లోతుకు తీస్తే, కానివారు మెట్టకు తీస్తారు.
అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వమూ లేదు.
అమ్మదగ్గిర కింద పడుకొన్నా, అబ్బ దగ్గర నేల పడుకున్నా ఒకటే !
అన్నీ వున్నవి, అయిదవతనము లేదు.
అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.
అప్ప ఆర్భాటం, బావ బడాయేగాని, ఆకలి వేస్తే అన్నం మెతుకు లేదు.
అప్ప చెల్లెలు బ్రతుకగోరితే, తోడి కోడలు చావు కోరుతుంది.
అప్పటి మాటకు దుప్పటి యిచ్చినాను గాని, కలకాలము కప్పుకోనిచ్చినానా?
అమ్మ పెట్టే నాలుగు అప్పుడే పెడితే చెయ్యనా?
అమ్మబోతే అడివి కొనబోతే కొరివి.

అరటి పండు వలిచి చేత వుంచినట్టు.
అరుంధతీ కనపడదు, అధ్వాన్నమూ కనపడదు, అరవై వరహాల అప్పు మాత్రము
కనపడుతున్నది.
ఆర్తి దుఃఖం ఆరునెలలు, కడుపు దుఃఖం కలకాలం.
అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనుడికి ఏమీ దక్కదు.
అలవాటు లేని ఔపాసనం చెయ్యబోతే మీసాలన్నీ తెగకాలినవి.
అలివిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండా కొడుకు.
అల్లుడికి నెయ్యిలేదు, అల్లుడితోటి కూడా వచ్చిన వారికి నూనె లేదు.
అల్లుడికి వండిన అన్నము కొడుకుకు పెట్టి కొట్టుకొన్నదట.
అవలక్షణము గలవానికి అక్షంతలు యిస్తే, అవతలికి పోయి నోట్లో వేసుకున్నాడట.
అవసరగానికి ఆకులో పెట్టు, నాకు నేలను పెట్టు.
అంగట్లో బెల్లం, గుళ్ళో లింగానికి నైవేద్యం.
అందనిపూలు దేవునికి అర్పణ అన్నట్లు.
అందని మ్రాని పండ్లకు ఆశపడ్డట్లు.
అగ్నికి వాయువు తోడైనట్లు.
అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
అడకత్తెరలో పోక చెక్కవలె.
అడవి కాచిన వెన్నెల.
అడుసులో నాటిన స్తంభము.
అర్ధరాత్రి వేళ అంకమ్మ సివాలు.
అర్ధశేరు బియ్యం తింటావురా ? అంటే మూడు మెతుకులు విడిచి పెడతానన్నాడట.
అర్ధమూ, ప్రాణమూ ఆచార్యాధీనము, తాళము, దేహమూ నా అధీనము.
అర్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు బిడ్డలు పుట్టరు.
అతి రహస్యం బట్ట బయలు.
అత్తపేరు పెట్టి కూతుర్ని కుంపట్లో వేసినట్లు.
అదంత్రునికి ఆశపెట్టరాదు – బలవంతునికి చోటివ్వరాదు.
అద్దెకు వచ్చిన గుర్రాలు – అగడ్తలు దాటుతాయా?
అన్నీ తెలిసినవాడూ లేడూ ఏమీ తెలియనివాడూ లేదు.
అప్పు లేకపోతే ఉప్పు గంజేమేలు.
అంగట్లో అరువు తలమీద బరువు.
అంగటి వీధిలో అబ్బా! అంటే, ఎవరికి పుట్టావురా కొడకా! అన్నట్లు.
అంగిట్లో బెల్లం, ఆత్మలో విషం.
అంటక ముట్టక దేవుడికి పెడుతున్నాను, ఆశపడకండి బిడ్డలారా! అవతలికి పోండి
అన్నాడట!
అంటుకోను ఆముదం లేదుకాని, మీసాలకు సంపెంగ నూనె.
అంటుబొడ్డు, ఆవుతల, ఎద్దుకు – జారుబొడ్డు, చనుకట్టు, ఆవుకు ముఖ్య లక్షణాలు.

అండ ‘వుంటే’ ‘కొండ’ బద్దలు కొట్టవచ్చు.
అంతంత కోడికి అర్ధశేరు మసాలా.
అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతంత కొప్పు.
అంత పెద్ద పుస్తకం చంకలో వుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్టు.
అంతా నిండా మునిగాక చలేమిటి?
అంతము లేని చోటు లేదు, ఆదిలేని ఆరంభం లేదు.
అంత వురిమీ – ఇంతేనా కురిసింది.
అంతా అన్నీ తెలిసినవాడూ లేడు, ఏమి తెలియనివాడూ లేడు.
అంతా అయిన వాళ్ళే, మంచినీళ్ళు పుట్టవు.
అంతా ఆడపిల్లలే ఉంటే అన్నీ అబద్దాలే చెప్పాలట.
అంతా బ్రాహ్మణులే అయితే కోడిపెట్ట ఏమైనట్లు.
అంతా మనవాళ్ళే గాని, అన్నానికి రమ్మనే వాళ్ళే లేరు.
అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.
అందం చందం లేని మగడు మంచం నిండా వున్నట్లు.
అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్నట్లు.
అంద ముంటే ఆయెనా? అదృష్టం వుండద్దా?
అందరికన్నా తాడిచెట్టు పెద్ద.
అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు.
అందరికీ అన్నం పెట్టేవాడు – రైతే.
అబద్ధమాడినా అతికినట్లుండాలి.
అబద్ధాల పంచాంగానికి అరవై ఘడియలూ వర్జ్యమే.
అమ్మ పెట్టను పెట్టదు, అడుక్కు తిననూ తిననివ్వదు.
అవ్వాకావాలి, బువ్వా కావాలి.
అందరినీ మెప్పించడం అలవిగాని పని.
అందరూ అందలమెక్కితే మోసేదెవరు?
అందరూ మాటలు చెప్పేవారే గాని, ఉద్యోగ మిచ్చేవారు ఒకరూ లేరు.
అయ్యవారిని చేయబోతే కోతి అయింది.
అందరూ శ్రీ వైష్ణవులే – బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి.
అందానికి దాల్చిన ఆభరణం ఆపదలో ఆదుకుంటుంది.
అందితే తియ్యన, అందకుంటే పుల్లన.
“అ ఆ”లు రావు, కానీ అగ్రతాంబూలం మాత్రం కావాలి.
అకటా వికటపు రాజుకు అవివేకి ప్రధాని, చాదస్తపు పరివారం.
అక్క ఆరాటమేగాని, బావ బతకడు.
అంధునికి అద్దం చూపినట్లు.
అక్కరకురాని అర్థమెందుకు? అక్కరకురాని చుట్టమెందుకు?

అక్కరకు వచ్చినవాడే అయిన వాడు.
అక్క మనది అయితే బావ మన వాడవుతాడా?
అక్కర గడుపుకొని తక్కెడ పొయ్యిలో బెట్టినట్లు.
అక్కర తీరితే, అక్క మొగుడు కుక్క
అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
అగ్ని శేషం, ఋణ శేషం, శత్రు శేషం ఉంచరాదు.
అచ్చమ్మ పెళ్లిలో బుచ్చమ్మ శోభనం.
అచ్చిరాని కాలంలో అడుక్కు తినబోతే ఉన్నబొచ్చె కాస్త ఊడ్చుకొని పోయిందట.
అచ్చివచ్చిన భూమి అడుగయినా చాలు.
అచ్చివస్తే హనుమంతుడి మూర, లేకపోతే కోతిమూర.
అగ్రహారం పోతే పోయింది గాని యాక్టు అంతా బాగా తెలిసింది.
అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు.
అగ్గువ కొననీయదు, ప్రీతి అమ్మనీయదు.
అత్తవారిల్లంటే కత్తుల బోను.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.
అత్తా ఒక ఇంటి కోడలే, మామా ఒక ఇంటి అల్లుడే.
అత్తా నీ కొంగు తొలిగిందన్నా తప్పే తొలగ మబలేదన్నా తప్పే.
అజీర్ణానికి ఆకలి మెండు.
అడిగితే చిరాకు, అడగకపోతే పరాకు.
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.
అడ్డము దిడ్డము తిరిగెడి తెడ్డెరుగునె పాడి తీపి.
అడ్డాలనాడు బిడ్డలుగాని, గడ్డాలనాడు బిడ్డలా.
రాకుంటే అసలు పనిలో సాయపడ్డట్టే.
అల
అటుకులు బొక్కేనోరు, ఆడిపోసుకొనే నోరు ఊరుకోవు.
అడగబోయిన అల్లీ సాబ్ రాలేదు, పిలవబోయిన పీరు సాబ్ రాలేదు.
అడవిలో ఆంబోతై తినాలి, అత్త ఇంట్లో అల్లుడై తినాలి.
అడగందే అమ్మయినా పెట్టదు.
అడ్డేటు మీద గుడ్డేటు.
అతికించిన కోరమీసం అట్టే నిలుస్తుందా?
అతిచేస్తే గతి చెడుతుంది.
అతివృష్టి అయినా, అనావృష్టి అయినా ఆకలిబాధ తప్పదు.
అత్త కాలం కొన్నాళ్లు కోడలి కాలం కొన్నాళ్లు.
అడుక్కు తినేవాడికి ఆలి అయ్యేకంటే – భాగ్యవంతుడికి బానిస అయ్యేది మేలు.
అడుగు తప్పితే పిడుగు తప్పుతుంది.
అత్త చచ్చిన ఆరు నెలలకి కోడలు వలవలా ఏడ్చిందట.
అత్త చస్తే కోడలు ఏడ్చినట్లుఅత్త బద్దలు కొడితే మట్టి కుండ, కోడలు బద్దలు కొడితే బంగారు కుండ.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు
అత్త మెచ్చిన కోడలూ లేదు. కోడలు మెచ్చిన అత్తా లేదు.
అత్తలేనమ్మ ఉత్తమురాలు, మామ లేనమ్మ మరీ భాగ్యశాలి.
అత్త లేని కోడలుత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు.
అత్త వారి ఇంటి ఐశ్వర్యం కన్నా పుట్టింటి గంజి మేలు.
అత్తవారింటి సుఖము మోచేతి దెబ్బవంటిది.
అదను ఎరిగి సేద్యమూ పదును ఎరిగి పైరు.
అదరా బాదరా పదరా మొగుడా అని ఏ పని చేయవద్దు.
అదుపుకు రాని ఆలిని, అందిరాని చెప్పును విడవమన్నారు.
అడుక్కు తినేవాడికి అరవై ఇళ్ళు/ఊళ్ళు
అడుసు తొక్కనేల కాలు కడగనేల?
అదిగో అంటే ఆరునెలలు.
అదేమిటి రెడ్డి, వంగి వంగి నడుస్తావంటే ఎప్పటి కాలు ఇంత కాలం పని చేసిందే గొప్ప అన్నాడుట.
అదృష్టం వుంటే చేయి జారిపోయేది కూడా చేతికి వస్తుంది.
అధికారం బంగారు గొలుసుల బందిఖానా.
అధికారికి చెవులుంటాయిగాని కళ్లుండవు.
అధికారి భార్యపోతే అందరూ మూలుగుతారు. అధికారే పోతే ఎవ్వరూ రారు.
అనుభవం ఒకరిది ఆర్భాటం ఇంకొకరిది.
అనుమానం ప్రాణ సంకటం.
అనువుగాని చోట అధికులమనరాదు.
అదై వస్తే అణా, వాడై పోతే రూపాయి.
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు.
అదృష్టవంతుణ్ణి చెరిపే వారు లేరు, బ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు.
అన్నం అరగడిలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా వుంటుంది.
అన్నం చొరవేగాని, అక్షరం చొరవలేదు.
అధికారీ, తలారీ ఒకటైతే అనుకున్నట్లు దొంగిలించవచ్చు.
అనంతపురం అప్పయ్యదీ బట్టతలే, నా మొగుడిదీ బట్టతలే: అయితే అప్పయ్యది ఐశ్వర్యపు
బట్టతలయితే నా మొగునిది పేను కొరికిన బట్టతల.
అనగా అనగా రాగం తినగా తినగా రోగం.
అన్నం తిన్నవారు, తన్నులు తిన్నవారు మరిచిపోరు.
అయినవాడు కాలుదువ్వితే, కానివాడు మీదికి వస్తాడు.
అయినవాళ్ళకు ఆకులలోను, కానివాళ్ళకు కంచాల లోను.
అయినోణ్ణి అడిగే దానికంటే, కానోణ్ణి కాళ్లు పట్టుకునేది మేలు.
అన్నమైతేనేమిరా? సున్నమైతేనేమిరా ? ఈ పాడుపొట్టకు అన్నమే వేతమ్మురా.

అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు, నడుమ వున్న వారే నలిగి చచ్చారు.
అన్ని కార్తెలు తప్పినా హస్తకార్తె తప్పదు.
అన్నిటికి వాతే మందనే వైద్యుణ్ణి అవతలే ఉంచు.
అన్ని రసాలకన్న అధర రసము మిన్న.
అన్ని దానాలకంటే నిదానం మంచిది.
అన్ని రుచులు సరేగాని, అందులో ఉప్పులేదు.
అన్నీ పండించిన వాడికే అన్నం కరువు.
అన్నీ వున్న విస్తరి అణిగి మణిగి వుంటుంది; ఏమీలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.
అన్యాయపు ఊరిలో ఆలూ మొగుడికే రంకు.
అపండితుడికంటే అర్ధపండితుడే అపాయకరం.
అపకారికైనా, ఉపకారం చేయాలి.
అప్పు ఎప్పటికైనా ముప్పే.
అప్పు తీర్చేవాడికి, అపహరించే వాడికి పత్రం (ప్రాంసరీ నోటు) అవసరం లేదు.
అప్పు ఇచ్చివాడు బాగు కోరును, తీసుకున్నవాడు చెడు కోరును.
అప్పులున్న వాడి వెంట, చెప్పులున్న వాడివెంట పోరాదు.
అప్పులేనివాడు అధిక సంపన్నుడు.
అబద్ధం చెపితే అన్నం పుట్టదు, నిజం చెపితే నీళ్ళు పుట్టవు.
అబద్ధముల నాలకించు ఆఫీసరుకు ఉద్యోగులందరూ చెడ్డవారే.
అబ్బలేని బిడ్డ, కంచెలేని చేను, కన్నతల్లి లేని బిడ్డ ఒకటే.
అభాగ్యుడికి ఆకలెక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ.
అభ్యసించిన విద్య అంతరించదు.
అభ్యాసము కూసు విద్య.
అమరం నోటికి వసంత కావ్యాలెందుకు? కాల్చనా!
అమరితే ఆడది అమరకుంటే గాడిద.
అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక.
అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినా తిననీయదు.
అమ్మబోతే అడివి కొనబోతే కొరివి.
అడగందే అమ్మయినా పెట్టదు.
అయితే అవతల ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు.
అయితే అమీరు కాకపోతే గరీబు.
అయితే ఆరిక (ధాన్యం) కాకుంటే కంది.
అయిదవతనం లేని అందం అడుక్కుతిననా?
అయిదులో వంగనిది అరవైలో వంగుతుందా?
అయిదేళ్ళ ఆడపిల్ల అయినా మూడేళ్ళ మగపిల్లవాడికి లోకువే.
అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకు.
అసలు కన్నా వడ్డీ ముద్దు – వడ్డీ ఆశ అసలుకే నష్టం.

అసలు కన్నా వడ్డీ ముద్దు, కొడుకుకన్న మనవడు ముద్దు.
అవ్వకు మనుమడు ఆవులింత నేర్పినట్లు.
అవ్వను పట్టుకొని వసంతా లాడినట్లు.
అసలు దేవుడికే లేక అఘోరిస్తుంటే ఆంజనేయులు నాకూ గుడి అన్నట్టు.
అసలే అయోమయం, అందుకుతోడు అంధకారం.
అయ్యకు ఆరాటమేగాని పోరాటం తక్కువ.
అయ్యకు తొంభై ఎనిమిది మంచి గుణాలున్నాయి. కానీ, రెండు గుణాలు తక్కువ. అవి

ఒకటి : తనకుగా తోచదు, మరొకరు చెపితే వినరు.
అయ్యతో సద్దన్నం తిని అక్కతో వేడన్నం తిని, అమ్మతో మారన్నం కూడా తింటాడు.
అయ్యకు రెండో పెళ్లి అని సంతోషమేగాని అమ్మకు సవతి పోరు అని ఎరుగడు.
అయ్యకు వణుకు ప్రాయం అమ్మకు కులుకు ప్రాయం.
అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకి సరి.
అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఎలా?
అశుద్ధం మీద రాయివేసి ముఖమంతా చిట్లించుకున్నట్లు.
అసత్యంతో సంపాదించుకున్న పలుకుబడి, సత్యం బయట పడే వరకే ఉంటుంది.
అసలే కోతి దానికితోడు కల్లు తాగింది, పైన తేలు కుట్టింది.
అసూయ ముందు, ఆడది వెనుక.
అయ్యేపూజ అవుతుందనీ, ఊదే శంఖం ఊదేస్తాం.
అరక అరిగితే గరిసె విరుగుతుంది.
అల్లుడి కత్తికి రెండువైపులా పదునైతే, అతని అక్కకు ఆరువైపులా పదును.
అల్లుడితో భోజనం, కొడుకుతో చదువు లాభసాటి వ్యవహారం.
అవివేకితో చెలిమి కంటే వివేకితో విరోధం మేలు.
అరకాసుకి కోల్పోయిన శీలం, అంతులేని ధనమిచ్చినా తిరిగి రాదు.
అరగని కూడు, జరగని మాట.
అరచేతిలో వెన్నబెట్టుకొని నెయ్యికి ఊరంతా తిరిగినట్టు.
అరచేతిలో వైకుంఠం చూపినట్టు.
అరణ్య రోదనం.
అరనిమిషం తీరిక లేదు, అర్థరూపాయి సంపాదన లేదు.
అరవం అధ్వాన్నం, తెలుగు తేట, కన్నడం కస్తూరి.
అరవ ఏడుపు.
అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను.
అల్పుని దగ్గరికి జేరిస్తే అధిక ప్రసంగం చేస్తాడు.
అరవ చాకిరి మంగలి (సర్వాంగ క్షౌరం చేసే మంగలి) అందరికి దొరకొద్దూ?
అరవల పొట్ట, తమలపాకులు కట్ట, ఎప్పుడూ తడుపుతూనే ఉండాలి.
అరవై అడుగుల గడనెక్కి ఆడినా, అతను కిందికి దిగి పైసలు తీసుకోవాల్సిందే.

అరవై ఆరు పిండివంటలు ఆవు చంటిలోనే వున్నాయి.
అరవై ఏండ్లు నిండినవాణ్ని ఆలోచన అడక్కు, ఇరవై ఏండ్లు నిండని వానికి పెత్తనమీయకు.
అరవై వరహాలు యిచ్చినా అత్తవంటి బానిస దొరకదు.
అలకాపురికి రాజైనా అమితంగా ఖర్చు చేయగూడదు.
అలల సముద్రమైనా దాటి అర్ధం (ధనం) ఆర్జించాలి.
అల్ప పాండిత్యం అనర్ధానికి మూలకారణం.
అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోకూడదు.
అలిగే బిడ్డతో, చెలిగే గొడ్డుతో ఏగేది కష్టం.
అరకాసు పనికి ముప్పాతిక బాడుగ.
అరఘడియ భోగం, ఆరు నెలల రోగం.
అలివిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండాకొడుకు.
అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట.
అల్లమంటే తెలియదా బెల్లం మాదిరి పుల్లగా వుంటుంది అన్నాడట.
అల్లునికి బెట్టు ఇల్లాలికి గుట్టు.
అరిటాకు మీద ముల్లుపడ్డా, ముల్లుమీద అరిటాకు పడ్డా అరిటాకుకే ముప్పు.
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
20
ఆశపడి పోసినన్నం తింటే, పాడుపడి పది లంఖఃణాలు చేసినట్లు.
ఆశలేని కూటికి ఆకలి లేదు.
ఆశ్లేష వాన అరికాలు తడవదు.
ఆ సోది మాటలకు అర్ధమూ లేదు, గుడ్డికంటికి చూపూ లేదు.
ఆచారం ఆరు బారలు, గోచి పాత మూడు బారలు.
ఆకు వేసి నేలమీద వడ్డించినట్లు.
ఆగడపలు వేసినవి అత్తా అంటే, అట్లకు బియ్యం నానబొయ్యి కోడలా అన్నదట.
ఆకును అందదు, పోకను పొందదు.
ఆకు పోయి నూతపడితే, వెతకపోయి ఏడుగురు పడ్డారట.
ఆచారం ఆచారం అన్నం బొట్లు అంటే, పెద్ద చెరువు కుక్క ముట్టుకున్నది అన్నట్లు.
ఆచారం ఆరుబారలూ, గోచిపాత మూడు బారలూ.
ఆగం అడివప్పా అంటే, మడిగ తెరువప్పా అన్నదంట.
ఆచారం ముందర, అనాచారం వెనుక.
ఆచారానికి అంతము లేదు, అనాచారానికి ఆదీ లేదు.
ఆ అంటే అపరాధము ఊ అంటే ఉపరాధము నారాయణ అంటే బూతుమాట.
ఆ అంటే అలుసైపోతుంది, ఊ అంటే ఊపిరిపోతుంది.

ఇంట్లో ఆరాడే బాల వితంతువు నీ భార్యా, మీ అన్న భార్యా? అని అడిగాడంట.

ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం.
ఆటాపాటా మాయింట, మాపటి భోజనం మీ ఇంట.
ఆడకాడక సమర్తాడితే, చాకలోడు కోక ఎత్తుకు పోయినాడట.
ఆడది తిరిగి చెడును, మగవాడు తిరగక చెడును.
ఆ నష్టికీ సరిరావే నూతపడుదాము అంటే, ఆదివారము రోజున అందరమూ పడుదాము ఆత్మా అన్నదట.
ఆదాయము లేకనే శెట్టి వరదబోడు.
ఆపద మొక్కులు, సంపద కుంట్లు.
ఆపదలైనా, సంపదలైనా ఒంటరిగా రావు.
ఆకలి గొన్న కరణము కవిలె తీసినాడు.
ఆడది బొంకితే గోడపెట్టినట్టు, మొగవాడు బొంకితే తడిక పెట్టినట్టు.
ఆడలేక మద్దెల ఓడన్నట్లు.
ఆపస్తంబులా ఆశ్వలాయనులా అంటే ఆపస్తంబులమూకాము, ఆశ్వలాయనులమూ కాము,
అప్పారావు గారి హర్కారాలము అన్నారట.
ఆమడలు దూరమైతే అంతఃకరణలు దూరమా ?
ఆవు ఎక్కడ తిరిగితే నేమి మన ఇంటికి వచ్చి పాలిస్తే సరి.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.
ఆవును కొంటే దూడను గూడా కొన్నట్లే.
ఆవు పాడి ఎన్నాళ్ళు? ఐశ్వర్యమెన్నాళ్లు? బళె పాడి ఎన్నాళ్లు భాగ్యమెన్నాళ్ళు.
ఆవు ముసలిదైనా పాల రుచి తగ్గుతుందా?
ఆవు మేత లేక చెడింది, పైరు చూడకుంటే చెడింది.
ఆకలని రెండుచేతులతో తింటారా?
ఆకలి అవుతున్నది అత్తగారూ అంటే, రోకలి మింగవే కోడలా అన్నదట.
ఆకలి ఆకాశమంత, నోరు సూది బెజ్జమంత.
ఆకలి గొన్నవాడు ఎంగిటికి యేవగించడు.
ఆకలి అవుతుంది అత్తగారూ అంటే, రోకలి మింగవే కోడలా అన్నదట.
ఆడలేక మద్దెల వానిపై గోడు పోసుకున్నట్లు.
ఆకులు ఎత్తరా అంటే, విస్తళ్ళు లెక్కబెట్టినట్లు.
ఆకులున్న చెట్టుకి నీడ వుంటుంది, పిల్ల తల్లికి పాలుంటాయి.
ఆడి తప్పరాదు, పలికి బొంకరాదు.
ఆడింది ఆట, పాడింది పాట.
ఆడే కాలు, పాడే నోరు ఊరికే వుండవు.
ఆ పప్పు ఈ నీళ్ళకు వుడకదు.
ఆయష్షు లేక చస్తారు గాని, ఔషధంలేక కాదు.
ఆయుష్షు తీరినవాడు ఆరు నెలలకు చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.

అరగించగా లేనిది అడిగితే వస్తున్నదా?
ఆయష్షు వుంటే గాయమంత సుఖము లేదు.
ఆ గొడ్డు మంచిదయితే ఆ ఊళ్లోనే అమ్ముడుపోయేది.
ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.
ఆరు ఆవులమ్మ మూడావులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.
ఆరుద్రవాన అరుదువాన.
ఆరునెలల నుంచి వాయించిన మద్దెల ఒట్టిదా గట్టిదా అన్నట్లు
ఆరునెలల దుమ్ము గూట్లో ఉన్నదేమిరా అంటే, నేను పనిలో చేరి మూడునెలలే అయ్యింది. అన్నాడట.
ఆరెలమాను కింద బూరెలమాను విరగబడ్డట్టు.
ఆర్చేవా, తీర్చేవా, అక్కరకు వస్తే మునిగేవా !
ఆలికి గంజిపోయనివాడు ఆచారము చెప్పే తల్లికి గంజిపోయనివాడు తగవు చెప్పినట్టు.
ఆలిని వల్లనివానికి ఈలకూరలో ఉప్పుచాలదు.
ఆశపడి ఆరులంఖఃణాలు చేస్తే, ఆవేళా జొన్నమెతుకేనా.
ఆచారం చెప్పిన పెద్దమనిషి ఆకూటికే వచ్చాడుట.
ఆచారానికి అంతం లేదు. ఆనాచారానికి ఆది లేదు.
ఆచార్యుడికి ద్రోహం చేసినా ఆత్మకు ద్రోహం చేసుకోరాదు.
ఆడదాని చేతి డబ్బూ, మగవాడి చేతి బిడ్డా బ్రతకవు.
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు.
ఆడే కాలూ, పాడే నోరూ ఊరుకోవు.
ఆకలి లేకుండా నీకు మందు చెబుతా ముందు నాకు కాస్త గంజి నీళ్ళు పోయ్యమన్నట్లు.
ఆకలి గొన్న కరణం పాత ఫైళ్ళు బయటికి తీశాడట.
ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు. వలపు సిగ్గెరుగదు.
ఆకారం చూచి ఆశపడ్డానేగాని అయ్యకు అందులో పసలేదని నాకేమి తెల్సు.
ఆకారం పుష్టి నైవేద్యం నష్టి.
ఆ మాటకూ ఈ మాటకూ పెద్దకోడలు, ఆ చేతి పెట్టుకు ఈ చేతి పెట్టుకు అడ్డుగోడ.
ఆముదములో ముంచిన మేకువలె వున్నాడు.
ఆగ్రహాన ఆన బెట్టుకొన్నట్లు.
ఆటాపాటా మాయింట, మాపటి భోజనం మీయింట.
ఆడదాని నోటిలో నువ్వుగింజ నానదు.
ఆడదానికి పురిటిపురిటికి గండం, మగాడికి దినదిన గండం.
ఆశకు అంతులేదు, నిద్రకు సుఖం లేదు.
ఆశకు పోతే గోచి ఊడిందట.
ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు.
ఆరాటపు కదురు యేరాటాన బెట్టినా బరబర.
ఆరాటపు పెండ్లి కొడుకు పేరంటాళ్ళ వెంటబడ్డాడట.

ఆలూమగల కలహం ఆకూ వక్కా నమిలినంతసేపే.
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగము.
ఆలు లేత, నారు ముదురు కావాలి.
ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
ఆడదే అమృతం, ఆడదే హాలాహలం.
ఆడదై పుట్టే కంటే అడవిలో మానై పుట్టేది మేలు.
ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.
ఆలోచన తక్కువ, ఆవేశం/ఆగ్రహం ఎక్కువ.
ఆలోచిస్తామంటే ఆరు నెలలు, పరిశీలిస్తామంటే పది నెలలు.
ఆవగింజ దూరేంత సందే ఉంటే అప్పుడే అరవై గారెలు తిననా? అన్నాడట.
ఆవులిస్తే పేగులు లెక్కబెట్టినట్లు.
ఆడపడుచు ఉసూరుమంటే ఆరుతరాలు అరిష్టం.
ఆడపిల్ల పుట్టిందంటే ఆయువు సగం క్రుంగిందన్న మాటే.
ఆడపిల్ల పెళ్లి, అడుగు దొరకని బావి, అంతం చూసేవి.
ఆడబిడ్డ అర్ధ మొగుడు.
ఆడలేక పాత గజ్జెలు అన్నట్లు.
ఆలు మొగని సందు పోట్లాట, అద్దముమీద పెసరగింజ నిలిచనంత సేపు.
అవగింజ అట్టేదాచి, గుమ్మడికాయ గుల్లకాసుగాయెంచేవాడు
ఆవును చంపి, చెప్పులు దానం చేసినట్లు.
ఆత్రగానికి బుద్ది తక్కువ.
ఆదర్శాలు శిఖరమెక్కి కూర్చుంటే అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి.
ఆదాయం లేనిదే శెట్టి వరదను బోడు.
ఆదిలోనే హంసపాదు.
ఆపదలో అడ్డుపడ్డవాడే చుట్టం. అక్కరకు వచ్చినవాడే అయినవాడు.
ఆపద వేళలో అబద్ధం అప్పులేదు.
ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు.
ఆపదలో ఆదుకోవాలి, ఆస్తిలో పంచుకోవాలి.
ఆపదలో మ్రొక్కులు, సంపద రాగానే మరపులు.
ఆ బుర్రలో విత్తనాలే.
ఆమెకు ఆన్నీ వున్నాయి కానీ, అయిదోతనమే ( ముత్తయిదుతనం ) లేదు.
ఆమె పేరు కేశసుందరి, తల చూస్తే బోడి.
ఆయం తప్పితే గాయమంత సుఖం లేదు.
ఆయనేవుంటే మంగలాయన ఎందుకు.
ఆయుస్సు గట్టిగా వుంటే అడవిలో వున్నా అయోధ్యలో వున్నా భయంలేదు.
ఆరంభ శూరుడికి ఆర్భాటమెక్కువ.
ఆరాటమేగాని, పోరాటం లేదు.

ఆరికకు చిత్తగండం, ఆడదానికి పిల్ల గండం.
ఆరుద్ర కురిస్తే దరిద్రం లేదు.
ఆరునెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు.
ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు.
ఆడదాని బ్రతుకు అరిటాకు వంటిది. ముల్లు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరటాకు వచ్చి ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టం.
ఆడదానికి మగవాడు, అప్పులవాడికి షాహుకారు మొగుళ్లు.
ఆశ సిగ్గెరుగదు, నిద్ర సుఖ మెరుగదు.
ఆశ బోధిస్తుంది. అవమానం బాధిస్తుంది.
ఆస్తి కొక పుత్రుడు, ప్రేమ కొక పుత్రిక.
ఆహారంపట్ల వ్యవహారంపట్ల మొగమాటం పనికిరాదు.
ఆమడలు దూరమైతే, అంతఃకరణలు దూరమా?
ఆముదపు చేటేకాని, బిడ్డ బతకదు.
ఆముదపు విత్తులు ఆణి ముత్యాలగునా?
ఆలుకాదు, అది (అతని) తల వ్రాలు.
ఆలుబిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయినాడట.
ఆలు బెల్లమాయె, తల్లి విషమాయె.
ఆకలి కాకుండా నీకు ఔషధము యిస్తాను, నీ యింట్లో చద్ది నాకు పెట్టు అన్నాడట.
ఆ వూరి దొర ఈ ఊరికి తలారితో సమానం.
ఆశ అరవై రోజులు, మోహం ముప్పై రోజులు.

Leave a Comment