పద్మ భూషణుడు మన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

yarlagaddaమాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్రీయ హిందీ సంస్ధాన్ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త, రచయిత, జాతీయ స్ధాయి ప్రముఖులు, అజాతశతృవు, పద్మశ్రీ, ఇరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈరోజు రాష్ట్రపతి భవనంలో జరిగే పద్మ పురస్కారాల కార్యక్రమంలో హిందీ, తెలుగు భాషలకు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అందించిన సేవలకు గానూ పద్మభూషణ్ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ లంకెలో వీక్షించవచ్చు – https://www.youtube.com/user/DoordarshanNational. డాక్టర్ యార్లగడ్డ భాషాసేవ ద్వారా మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం. అలాగే ఈయన గురించి పూర్తి సమాచారాన్ని ఆయన వెబ్సైటులో వీక్షించవచ్చు .

లింక్ : http://ylp.in/about_ylp.html