కెనడాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ కల్గేరీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 100కు పైగా తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. సాంప్రదాయ వస్త్రధారణలో అందరూ వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనిత కదం, మేఘన గుల్గోట ప్రదర్శించిన అర్ధనారీశ్వర నాట్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పంచాంగ శ్రవణాన్ని అందరూ శ్రద్ధగా ఆలకించారు. భరత నాట్యం, అంత్యాక్షరి తదితర కార్యక్రమాలు అలరించాయి. వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన కార్యనిర్వాహక కమిటీ ప్రెసిడెంట్ హర్ష కొత్తపల్లి, కల్చరల్ సెక్రటరీ అనిత కొదం, ట్రెజరర్ వినోద్ మ్యానాలను అందరూ అభినందించారు.
Source: Andhrajyothy