అంపశయ్య: మన జాతీయాలు

అంపశయ్య
భీష్ముడు తనను నిరాకరించాడనే కోపంతో ‘నిన్ను సంహరిస్తాను’ అని శపథం చేస్తుంది అంబ. దీనికి సమాధానంగా ‘నువ్వు ఏ రోజు అయితే ఆయుధం చేతపూని నా ఎదుట నిల్చుంటావో… అప్పుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను’ అని ప్రతిన పూనుతాడు భీష్ముడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి శివుడి కోసం తపస్సు చేసి ‘అంబ’ శిఖండిగా మారుతుంది. మహాభారత యుద్ధంలో… శిఖండిని అడ్డు పెట్టుకొని పాండవులు యుద్ధం చేయడం వల్ల భీష్ముడు అస్త్రసన్యాసం చేస్తాడు. భీష్ముడు అస్త్రసన్యాసం చేసిన వెంటనే అర్జునుడు అతని శరీరంపై బాణాల వర్షం కురిపిస్తాడు. ఆ బాణాలే అతని శయ్యగా మారుతాయి. ఎవరైనా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు లేదా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ‘అంపశయ్య పై ఉన్నట్లు ఉన్నాడు’ అంటారు.

సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి

Leave a Comment