తాపత్రయం: మన జాతీయాలు

తాపత్రయం
తాపాలు మూడు రకాలు… 1. ఆధ్యాత్మికతాపం,
2. అధిభౌతికతాపం, 3. అధిదైవికతాపం
మూడు రకాల తాపాలను భరించడమే తాపత్రయం. తన వ్యక్తిగత విషయాలకే కాకుండా ప్రపంచ సమస్యను తన సమస్య అనుకోవడం. కవి మాటల్లో చెప్పాలంటే ‘ప్రపంచ బాధే నా బాధ’ అనుకోవడం. అయితే వాడుకలో మాత్రం ఆధ్యాత్మిక అర్థంలో కాకుండా  ‘తాపత్రయం’ అనేదాన్ని ‘అత్యాశ’, ‘ఆరాటం’ అనే అర్థంలో వాడడం కనిపిస్తుంటుంది.

 

సేకరణ : “సాక్షి ఫన్ డే” మ్యాగజిన్ నుండి