శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము FREE PDF Sri Venkateswara Vrata Kalpam

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము | సాక్షాత్తూ శ్రీ స్వామి వారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పము | తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము

వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన
వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి

ఈ బ్రహ్మాండములో వేంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వేంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేదు. ఇక తర్వాత ఉండబోడు. సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించటానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు.
ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం, సమ్మిన వారికి కొంగుబంగారం, అనంతుడు, ఆపద మొక్కులవాడు. తరతరాలుగా స్వామి తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు.
శ్రీ వేంకటేశ వ్రతకల్పం 2005లో వ్రాయడం జరిగింది. ఇదంతా శ్రీ శ్రీనివాసుని అనుగ్రహం తప్ప మరొకటి కాదు. కలియుగమున మనలనందరిని అనేక బాధల నుండిరక్షించడానికి యీ శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పమును ఆ స్వామి అనుగ్రహించాడని ఈ పుస్తక రచయిత నమ్మకం. 2005 నుండి ప్రతి ఆరు నెలలకు వీలున్నన్ని పుస్తకములు ప్రచురించి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు యీ పుస్తకం పదునొకండు భాషలలోనికి అనువదించబడినది. దేశ విదేశాలలోని లక్షలాది భక్తులచే నిత్యం ఆచరింపబడుతున్నది.
ఈ పదేళ్ళుగా యీ వ్రతము చేసిన వారి నుంచి వారికి జరిగిన అనేక అద్భుత, సంతోషాలను వివరిస్తూ ఎన్నో ఫోను కాల్సు, ఎన్నో వుత్తరాలు, మరెన్నో ‘ఈ-మెయిల్స్ వస్తున్నాయి.

ప్రతి శనివారం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు యీ కథలను చదువుతున్నారు. అందువలన వారి జీవితము ఎంతో శుభప్రదంగా సుఖసంతోషాలతో గడుస్తున్నదని అంటున్నారు. ఆ శ్రీనివాసుడు ఎంతో దయామూర్తి తన భక్తులంటే ఆ స్వామికి, అనురాగం,
ఆప్యాయత. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యీ వ్రతం ఇంత విశేష ప్రాచుర్యం పొందిందంటే ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు.
ఆ శ్రీనివాసునికి తన భక్తులంటే అత్యంత ప్రేమ. మనం అహంకారాన్ని, ఈ ఇహలోక విషయాలపై మమకారాన్ని వదిలి ఆ స్వామిని ప్రార్థిస్తే అన్నీ తానే చూసుకుంటాడు.

కలియుగంలో ఇంతకుమించిన దైవం మరొకరు లేరు. ఇందువలననే తిరుమలను రోజూ కొన్ని వేలమంది దర్శిస్తూ, స్వామివారిని సేవిస్తున్నారు. శ్రీనివాసుని లీలలు అద్భుతం. ఆ స్వామిని మనసారా కొలిస్తే అంతటి మహత్తర దేవుడు మరొకరు మనకు కనబడరు. శ్రీ వేంకట తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందం మరొకటి ఉండదు.

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పంగా పిలువబడుతున్న ఈ పుస్తకం ఆ స్వామివారి అనుగ్రహంతో రచించడం జరిగింది. ఈ కలియుగంలో మానవులందరూ ఎన్నో బాధలు పడుతున్నారు. ఆ బాధల నుండి బయట పడడానికి ఈ వ్రతం ఒక్కసారి ఆచరిస్తే చాలు. అన్ని బాధలూ తొలగి పోతాయి.
ఈ వ్రతం మొదటి అధ్యాయం పవిత్ర తిరుమల కొండపైన రచించడం జరిగింది. మిగిలిన నాలుగు అధ్యాయాలు మహా మునులైన విశ్వామిత్ర, భరద్వాజ, వశిష్ఠ, అత్రి మహర్షుల అనుగ్రహంతో రచించడం జరిగింది.

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పం డౌన్లోడ్ ఛేసుకోండి – Download PDF

Leave a Comment