తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలి

తెలుగు వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన అగత్యం ప్రస్తు తం ఏర్పడిందని ప్రముఖులు పేర్కొన్నారు. వైజ్‌మెన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో ‘హెరిటేజ్‌ ఆఫ్‌ తెలుగు కల్చర్‌’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రముఖులు పూర్ణచంద్రరావు, శంకర్‌రెడ్డి, నటి రమ్యానాయుడు, హషన్‌ తదిత రులు తెలుగు సంస్కృతి వైభవం గురించి మా ట్లాడారు. కార్యక్రమ అధ్యక్షుడు వైఎస్‌ ఆర్‌ మూర్తి మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి, భాష కు సేవ చేస్తున్న జర్నలిస్టులను, కళాకారులను … Read more

నారాయణ భట్టు

నన్నయ సమకాలికునిగా ప్రసిద్దుడైన నారాయణ భట్టు 11వ శతాబ్దం వాడు . ఈయనకు కరీభ వజ్రాంకుడు అనే బిరుదు కలదు. ఈయన బహు భాషా కోవిడునిగాను, ఉద్దండ పండితునిగాను పేరు తెచ్చుకున్నాడు. ఇతని పాండిత్యాన్ని గుర్తించి రాజరాజ నరేంద్రుడు నందంపూడి దాన శాసనాన్ని లిఖింపజేసి ఆ అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు . ఈ శాసనమే భట్టు గురించిన పూర్తి వివరాలు తెలియజేస్తుంది. క్రీ.శ.1022 నుండి 1063వరకు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని వెంఘీ దేశాన్ని పాలించిన తూర్పుచాళుక్య చక్రవర్తి … Read more

తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం

vankayala

ఫిరంగిపురం : నాటకం జనజీవన స్రవంతిలో మమేకమై సామాజిక చైతన్యానికి ఊపిరి పోస్తుందని అభినయ నాటక కళా పరిషత్‌ అధ్యక్షుడు వంకాయలపాటి శివరామకృష్ణయ్య అన్నారు. శనివారం రాత్రి 11వ అభినయ నాటక కళా పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాటక పరిషత్‌ వ్యవస్థాపకుడు అభినయ శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నాటకంపై ఉన్న విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని పొనుగుపాడు గ్రామంలో నాటక పరిషత్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో … Read more

పర్యాటక, సాహిత్య కేంద్రంగా పోతన జన్మస్థలం

మహాభాగవత రచయిత, తెలంగాణ కవి బమ్మెర పోతన జన్మస్థలం పర్యాటక సాహిత్య కేంద్రంగా మారనుంది. వరంగల్ జిల్లాలోని ఈ ప్రాంతంతోపాటు పాలకుర్తి, వల్మిడిలను కూడా పర్యాటక సాహిత్య కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ.. నివేదిక రూపకల్పన చేస్తోంది. కమలాక్షునర్చించు కరములు, కరములు. శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ అంటూ.. అలనాటి కవుల్లో తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు కవి బమ్మెర పోతన. మహా భాగవతం ద్వారా ప్రపంచ భక్తి … Read more

చరిత్రను ఒపాసన పట్టిన లక్ష్మీ శ్రీజ

లక్ష్మీ శ్రీజ… కాకతీయుల పాలన నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ, ముఖ్యమంత్రి పనితీరు, మంత్రుల పేర్ల నుంచి కరంట్ ఎఫైర్స్ వరకూ… మూడవ తరగతి చదువుతున్న ఆ చిన్నారి అనర్గళంగా చెబుతుంటే, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసి ఆనందించి ముగ్ధుడయ్యారు. అంతేనా, తన సొంత ఖాతా నుంచి అప్పటికప్పుడు రూ. 10 లక్షలు ఇచ్చారు. శ్రీజ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి, బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, సుధారాణి దంపతుల గారాలబిడ్డ … Read more

‘ఒగ్గుకథ’కు ప్రాణం పోస్తున్న చుక్క సత్తెయ్య

తెలంగాణ జానపదం -ఒగ్గు కథ. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం.తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పూర్వం పల్లెల్లో వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు ఈ డిజిటల్ మాయాజాలం వచ్చిన తర్వాత ఇవన్నీ కనుమరుగై పోతున్నాయి. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. … Read more

తెలుగువారి హృదయనేత్రి మాలతీ చందూర్

maalatee chandoor

అలనాటి తెలుగు పత్రికలతో పరిచయం ఉన్న ప్రతి పాఠకుడికీ/పాఠకురాలికీ మాలతీ చందూర్ పేరు సుపరిచితమే. ఆంద్రప్రభ లో ప్రమదావనం శీర్షిక తో..స్వాతిమాసపత్రికలో పాతకెరటాలు శీర్షికతో దశాబ్దాల తరబడి సాహితీ ప్రియులను ఆకట్టుకున్నారు. ప్రమదావనం లో అయితే అంతర్జాతీయ వార్తల దగ్గరనుండి అంతరిక్షం దాకా దేని గురించి అడిగినా చాలా లోతుగా విశ్లేషించి మరీ చెప్పేవారు. కుటుంబ సమస్యల నుండి అంతర్జాతీయ సమస్యల వరకు చాలా విస్తృతంగా ప్రశ్నలు ఉండేవి. ఆవిడ కూడా అంతే విస్తృతంగా సమాధానాలు చెప్పేవారు. … Read more

నాసాలో మెరిసిన తెలుగు తేజం రత్నకుమార్ బుగ్గ

bugga-ratnakumar

నాసా తలపెట్టిన ఇన్నోవేటివ్ అడ్వాన్స్ డ్  కాన్సెప్ట్స్ అనే కార్యక్రమానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, తెలుగు తేజం రత్నకుమార్ బుగ్గ పంపిన ప్రతిపాదనలు సెలెక్ట్ అయ్యాయి. కాలిఫోర్నియాలోని జెట్ ప్రపల్సన్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న రత్నకుమార్ కు తొమ్మిది నెలలపాటు లక్ష డాలర్లు  తన రీసెర్చ్ కు అందించనుంది నాసా. రత్నకుమార్ తో పాటు మరో 13 మంది రీసెర్చ్ కు సెలెక్ట్ అయ్యారు. ప్రాథమిక అధ్యయనంలో విజయవంతమైతే రెండో దశ అధ్యయనానికి నాసా 5 లక్షల … Read more

సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి అమెరికా ప్ర‌భుత్వం అనుమతి

siliconandhra university

సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి అమెరికా ప్ర‌భుత్వం అన్ని అనుమ‌తులు ఇచ్చింది. భారతీయ క‌ళ‌లు, కూచిపూడి, క‌ర్ణాట‌క సంగీతంలో డిప్లోమా, డిగ్రీ స్థాయిల్లో కోర్సులు అందుబాటులోకి తెచ్చేందుకు రాజ‌ముద్ర పడింది. ఈ కోర్సుల్లో ప‌ట్టాలు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభ‌మైన సిలికానాంధ్ర యూనివ‌ర్సిటీకి కాలిఫోర్నియా రాష్ట్రంలో అనుమ‌తులు ల‌భించాయి. 12వ త‌ర‌గ‌తి పాసైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేర‌డానికి అర్హులు. భార‌త‌దేశం బ‌య‌ట తొలిసారిగా భార‌తీయ క‌ళ‌ల‌ను గుర్తిస్తూ ఆ క‌ళ‌ల‌కు ప‌ట్టం క‌ట్ట‌డంలో సిలికానాంధ్ర విజ‌యం సాధించింది. ఇలా భార‌తీయ … Read more

తెలుగు భాష విశిష్టమైనది : మలేషియాలో ఉగాది సంబురాల్లో ఎంపీ కవిత

తెలుగులోని కస్తూరి వాసన చక్కర పాకం.. అరవ భాషలోని అమృతరాశి.. కన్నడంలోని కస్తూరి వాసన..అంటూ ఇతర భాషల్లోని గొప్పదనాన్ని తనలో ఇమిడింపజేసుకున్న గొప్పదనం తెలుగుభాషది అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో మలేషియా తెలుగు సంఘం ఉగాది సంబురాలను శనివారం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత తెలుగుభాష గొప్పదనాన్ని, విశిష్టతను ఇలా కవిత రూపంలో వినిపించారు. మలేషియాలోని తెలుగు వారందరికీ దుర్మిఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ … Read more