గూడ అంజయ్య – Guda Anjaiah
ఆయన పాటలు ఆయుధాలు.. ఆ పాటల్లో పదాలు దూసుకుపోయే తూటాలు! సామాజిక ఉద్యమాలకు, ప్రగతిశీల శక్తులకు తిరుగులేని అస్ర్తాలు! ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణాలను దర్శించినా.. ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా అంటూ ఊరుమ్మడి బతుకుల్ని ఏకంచేసి.. దొరపై తిరుగుబాటుకు పురికొల్పినా.. భద్రం కొడుకో.. అంటూ రిక్షా కార్మికుడిని అప్రమత్తం చేసినా.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ప్రభుత్వవైద్యం గుల్లతనాన్ని నిలువునా కడిగేసినా.. అవ్వోడివా నువ్వు అయ్యోడివా.. తెలంగాణోనికి తోటి పాలోడివా? అని … Read more