మన జాతీయాలు – సాక్షి నుండి
పరశురామప్రీతి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. పరశురాముడికి అగ్నికి సంబంధం ఏమిటి? శివుడిని మెప్పించి పరశువు(గండ్రగొడ్డలి)ని ఆయుధంగా పొందుతాడు పరశురాముడు. ఇక పరశురామప్రీతి విషయానికి వస్తే… కార్తవీర్యుని కొడుకులు పరశురాముని తండ్రి జమదగ్ని తలను నరికి మహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక జమదగ్ని శవంపై ఏడుస్తూ ఇరవై ఒక్కసార్లు గుండెలు బాదుకుంటుంది. ఎన్నిసార్లు తల్లి గుండెలు బాదుకుందో అన్నిసార్లు క్షత్రియులందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు పరశురాముడు. కార్తవీర్యుని రాజధాని నగరాన్ని ఆగ్నేయాస్త్రంతో భస్మం చేస్తాడు. … Read more