తెలుగు గజల్ రచనా పోటీలు… బహుమతులు: డా. గజల్ శ్రీనివాస్

గజల్ చారిటబుల్ ట్రస్ట్ (GCT) ఆధ్వర్యంలో తెలుగు గజల్ రచనా పోటీలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. గజల్ ఛందస్సు లక్షణాలతో భావ వ్యక్తీకరణ కలిగిన గజల్‌కు ప్రధమ బహుమతిగా రూ.10,000/-, ద్వితీయ బహుమతి గా రూ.7,000/-, తృతీయ బహుమతిగా రూ. 5,000/-మరియు మూడు ప్రోత్సాహక బహుమతులు ఒక్కింటికి రూ. 1,116/- అందజేయబడతాయని తెలిపారు.

Ghajal Srinivas
గజల్‌లో ఏడు షేర్‌లు మాత్రమే ఉండాలని, ప్రతి కవితను పంపిన ఎంట్రీలతో నాలుగు గజళ్ళు పంపవచ్చని, అందులో న్యాయ నిర్ణేతలు ఒక దానిని పోటీకి స్వీకరిస్తారని తెలిపారు. పోటీకి పంపించబడుతున్న గజళ్ళు ఇంతకుముందు ఎక్కడా ప్రచురించబడి ఉండరాదని తెలిపారు. పోటీలో పాల్గొనేవారు తమ గజళ్ళను తెల్లకాగితంపై రాసి 31 మే 2016 లోపు దిగువ పేర్కొనబడిన చిరునామాకు పంపవలసిందిగా కోరారు.
పోటీలో విజేతలైన గజళ్ళతో పాటుగా, రచయితలు పంపిన గజళ్ళు కొన్ని ఎంపిక చేయబడి “తెలుగు గజల్ – 2016” గజల్ సంకలనంలో ముద్రించబడతాయని వెల్లడించారు. దీనికి అనుగుణంగా రచయితలు తమ అంగీకారపత్రంతో పాటుగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు చిరు పరిచయం జత చేసి గడువు తేది 31 మే 2016 లోపు పంపవలెనని తెలిపారు.
ఈ గజల్ సంకలనానికి ప్రఖ్యాత కవి శ్రీ రసరాజు సంపాదకులుగా ఉంటారని ట్రస్ట్ కార్యదర్శి శ్రీమతి సురేఖ శ్రీనివాస్ తెలిపారు.
గజల్‌లు పంపవలసిన చిరునామా:
గజల్ చారిటబుల్ ట్రస్ట్
6-3-629/2, A2
కబీర్ నివాస్
ఆనంద్ నగర్, ఖైరతాబాద్
హైదరాబాద్ – 500 004.
Ph: +91 99126 26256

Leave a Comment