అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్

అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్ వెలసింది. ఉన్న తెలుగు సంఘాలతో మైత్రీ బంధాన్ని పెనవేసుకుంటూ, తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కొన్ని వినూత్నప్రయత్నాలు తలపెడుతున్నట్టు న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ చిన్నా వాసుదేవరెడ్డి తెలిపారు. తెలుగువారి మధ్య న్యూజెర్సీ నగరంలో ఈ వేడుక జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రవాసభారతీయ విద్యార్థులు ప్రదర్శించినసాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే రీతిలో జరిగాయి.ఈ వేడుకలో న్యూజెర్సీ కాంగ్రెస్ మ్యాన్ గా తెలుగు వారి కీర్తిని ఇనుమడింపచేస్తున్న శ్రీ చివుకుల ఉపేంద్ర, దేవీశ్రీప్రసాద్,దిల్ రాజు, నిఖిల్, మధుశాలిని, గాయకులు సాగర్, రైనా రెడ్డి, ప్రిథ్వి, నరేంద్ర పాల్గొన్నారు. న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ చిన్నా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ,విస్తృతమైన కార్య ప్రణాళిక మేము సిద్ధం చేస్తూ ఉన్నా, అందులో, ముఖ్యంగాస్పూర్తిదాయకమైన గొప్ప కళాకారులని, సాహిత్యకారులని, సంగీతకారులని గౌరవించటం అనే అంశానికి ప్రాముఖ్యాన్ని కల్పిస్తున్నాం. ఇది ఒక భాద్యతే కాదు, వారిని గుర్తించటం మా అదృష్టం, మనకి మార్గదర్శకం కూడా. అందుకని, ఈ కోవలో ప్రధమ శ్రేణిలో వుండే తెలుగు సాహితీ దిగ్గజమైన శ్రీ సీతా రామ శాస్త్రి గారిని, గాన కోకిల శ్రీమతి పి. సుశీల గారిని సత్కరించుకునే కార్యక్రమాలు త్వరలో న్యూ జెర్సీ తెలుగు అసోసియేషన్ ద్వారా చేపట్టబోతున్నాం. ఈ అసోషియేన్ ద్వారా మేము చెపట్టబోయే విస్తృతమైన కార్యాచరణ కూడా త్వరలో మీ ముందు ఉంచుతాం. ఈ కార్యక్రమానికి తోడ్పాటునందిస్తున్న మిత్రులందికీ నా కృతజ్ఞతలు అన్నారు.
ఈ కొత్త తెలుగు సంఘం దినదిన ప్రవర్ధమానం కావాలని, వ్యవస్థాపకులు చేస్తున్న ప్రయత్నాన్ని వక్తలు కొనియాడారు. దేవీశ్రీప్రసాద్ తండ్రి కీ.శే. శ్రీ సత్యమూర్తిగారిపై తయారు చేసి ప్రదర్శించిన ఒక ఆడియో విజువల్ పలువురిని ఆకట్టుకుంది. దేవీశ్రీప్రసాద్, దిల్ రాజు, ఉపేంద్ర చివుకుల న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ తొలి సావనీర్ సంచికని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు కూడా పాల్గొని సంస్థ ఆలోచనలను కొనియాడారు. రెండుగంటలకు పైగా సాగిన గాయకుల పాటలతో, నటి మధుశాలిని నాట్యంతో కార్యక్రమం   దిగ్విజయంగా సాగింది. కార్యక్రామానంతరం అచ్చ తెలుగు భోజనంతో విందు ఏర్పాటు చేసారు నిర్వాహకులు. న్యూజెర్సీ అసోసియేషన్ తొలి కమిటీ సభ్యుల వివరాలు కూడా వెల్లడించారు.

Source: http://www.telugu.indiontv.com/news.php?title=new-jersey-telugu-association-and-quot-launched-with-great-fan-fare

Leave a Comment