గువ్వకుత్తుక! : మన జాతీయాలు

కొందరు చూడడానికి చాలా ధైర్యవంతుల మాదిరిగా కనిపిస్తారు. తీరా ఏదైనా కష్టం వస్తే మాత్రం… గొంతు స్వభావమే మారిపోతుంది… బలహీనమై వినిపిస్తుంది’’ ‘‘నిన్నటి వరకు పులిలా ఉన్నాడు. ఈరోజు కష్టం రాగానే గువ్వకుత్తుక అయ్యాడు’’ అంటారు. గువ్వ అనేది అడవి పావురం. ఇది చూడడానికి బలంగా ఉంటుంది. కానీ దాని గొంతు మాత్రం బలహీనంగా ఉంటుంది. ఆపదలో ఉన్నవారు అరిచినట్లుగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పుట్టిన జాతీయమే గువ్వ కుత్తుక. సేకరణ : “సాక్షి ఫన్ … Read more

గౌతముడి గోవు : మన జాతీయాలు

‘ఆయన జోలికి వెళ్లకు. గౌతముడి గోవులాంటోడు… ఇబ్బందుల్లో పడతావు’ అంటుంటారు. కొందరు చాలా సున్నిత మనస్కులు ఉంటారు. వారితో వ్యవహరించడంలో ఏ మాత్రం తేడా వచ్చినా… అవతలి వ్యక్తి ఇబ్బందుల్లో పడతాడు. విషయం ఎక్కడికో వెళ్లిపోతుంది. పురాణాల్లో గౌతముడు అనే మహర్షికి సంబంధించిన కథ ఇది. పుష్కరిణి ప్రాంతంలోని వనంలోకి ఒక మాయధేనువు వచ్చింది. గోవు పవిత్రమైనది కాబట్టి దానికి ఏ ఇబ్బందీ కలగకుండా గడ్డిపరకతో సున్నితంగా అదిలించాడు గౌతముడు. ఈమాత్రం దానికే ఆ గోవు కిందపడి … Read more

కాటి కాపరి ఏడుపు

కాటి కాపరి రోజూ… చావులను చూస్తూనే ఉంటాడు. కాబట్టి అతడు చలించడంగానీ, బిగ్గరగా దుఃఖించడంగానీ ఉండదని ఒక అభిప్రాయం ఉంది. జనన మరణాలకు అతీతంగా ఏ భావానికీ చలించకుండా అతని మనసు స్థిరంగా ఉంటుంది. మరి అలాంటి ఒక కాటికాపరి ఒక రోజూ ఏడుస్తూ కనిపించాడట. విషయం ఏమిటని ఆరా తీస్తే… ‘‘ఈరోజు ఒక్క శవమూ రాలేదు’’ అన్నాడట. శవం రాకపోతే సంతోషించాలిగానీ, ఏడ్వడం ఎందుకు? అనే సందేహం వస్తుంది. అయితే మరో కోణంలో చూస్తే మాత్రం… … Read more

గూడ అంజయ్య – Guda Anjaiah

ఆయన పాటలు ఆయుధాలు.. ఆ పాటల్లో పదాలు దూసుకుపోయే తూటాలు! సామాజిక ఉద్యమాలకు, ప్రగతిశీల శక్తులకు తిరుగులేని అస్ర్తాలు! ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణాలను దర్శించినా.. ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా అంటూ ఊరుమ్మడి బతుకుల్ని ఏకంచేసి.. దొరపై తిరుగుబాటుకు పురికొల్పినా.. భద్రం కొడుకో.. అంటూ రిక్షా కార్మికుడిని అప్రమత్తం చేసినా.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ప్రభుత్వవైద్యం గుల్లతనాన్ని నిలువునా కడిగేసినా.. అవ్వోడివా నువ్వు అయ్యోడివా.. తెలంగాణోనికి తోటి పాలోడివా? అని … Read more

మోగులూరి సోమాచారి

mogaloori-somachari

సామర్లకోటను చూస్తే అక్కడి చరిత్రాత్మక షుగర్‌ ఫ్యాక్టరీ, విశాఖకు దగ్గరలోని ప్రఖ్యాతిగాంచిన రైల్వేస్టేషనే ప్రపంచానికి కనిపిస్తుంది. విప్లవోద్యమ స్పర్శ ఉన్న వాళ్లకు మాత్రం సామర్లకోటంటే సోమాచారి గుర్తుకు వస్తాడు. సోమాచారి ప్రతిఘటనా దారుల్లో పుష్పిస్తాడు. విప్లవోద్యమ బాటల్లో ఒక మైలురాయిగా నిలుస్తాడు.   మోగులూరి సోమాచారి యోధుడే. ప్రజల కోసం ప్రతిఘటనా మార్గం ఎంచుకున్న వీరుల దారిలో మోగులూరి ప్రతిఘటనా జెండానే. 2016 జూన్‌ 6న తుది శ్వాస విడిచే దాకా నీ కోరిక ఏదంటే ప్రజల … Read more

పాఠశాల, కళాశాల స్థాయిలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీకే నష్టం!

దేశంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అత్యున్నత గౌరవ ప్రదమైన ఉద్యోగార్థుల కోసం యూపీఎస్‌సీ ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. వ్యాసరూప ప్రశ్న జవాబులుండే ప్రధాన పరీక్ష మార్కులను ఇంటర్వ్యూ మార్కులను కలిపి చివరి ఎంపిక ఉంటుంది. ఈ ప్రధాన పరీక్షలో ఒక ఎస్సే, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, రెండు ఆప్షనల్‌ సబ్జెక్టు పేపర్లతో పాటు ఇంగ్లీషు ఒక భారతీయ భాషలో కూడా పరీక్ష ఉంటుంది. అయితే ఇంగ్లీషు, భారతీయ భాష పరీక్షలు పదవ తరగతి స్థాయి ఉండి … Read more

14న విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలు

విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలను ఈనెల14వ తేదిన నిర్వహిస్తున్నామని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 14వ తేదీ పది గంటలకు విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని గురజాడ పాఠశాలలో 7, 8, 9, 10 తరగతి విద్యార్థులకు నీతి కథల పోటీలు ఉంటాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు వరుసగా రూ.500, రూ.300, రూ.200 నగదు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.

పావులూరి మల్లన

పావులూరి మల్లన: పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నయ కాలంనాటివాడని, కాదు నన్నెచోడుని కాలం వాడని వాదాలున్నాయి. పావులూరి మల్లన భీమకవికి సమకాలికుడు. ఇతను శివ్వన్న అను అతనికి కుమారుడు. భీమకవి సవతి తల్లులలో ఒకామెకి ఈ శివ్వన్న తోబుట్టువని మలయమారుత కవీంద్రునిచే రచించబడిన “నీతి శాస్త్రము”లో వ్రాయబడింది. పావులూరి మల్లన గణితశాస్త్రములో మిక్కిలి పండితుడు. “పావులూరి గణితము” అనే పేరుతో గణితశాస్త్రమున ఒక పుస్తకం రచించాడు. … Read more

డల్లాస్ తెలుగు మహాసభలకు నాటా భారీ ఏర్పాట్లు

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న డల్లాస్ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జరగునన్న మహాసభల్లో ఉత్తర అమెరికా నుంచే కాకుండా.. కెనడా, ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని నాటా ప్రతినిధులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్ల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎన్నో … Read more

ఒంగోలులో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా సమాచార సాంస్కృతిక శాఖ నిర్వహణలో మంగళవారం రాత్రి ప్రకాశం భవన్‌లో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ముఖ్యఅతిథిగా జాయింట్‌ కలెక్టర్‌-2 ప్రకాష్‌కుమార్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. నాటక రంగానికి వీరేశలింగం పంతులు చేసిన కృషి అనన్యమన్నారు. ఆయన అందించిన స్ఫూర్తితో ప్రభుత్వం రంగస్థల కళాకారుల సంక్షేమానికి అనేక విధాలా చేయూత అందిస్తోందన్నారు. విశిష్ట అతిథులు డీఆర్వో … Read more