తెలుగు భాష విశిష్టమైనది : మలేషియాలో ఉగాది సంబురాల్లో ఎంపీ కవిత

తెలుగులోని కస్తూరి వాసన చక్కర పాకం.. అరవ భాషలోని అమృతరాశి.. కన్నడంలోని కస్తూరి వాసన..అంటూ ఇతర భాషల్లోని గొప్పదనాన్ని తనలో ఇమిడింపజేసుకున్న గొప్పదనం తెలుగుభాషది అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో మలేషియా తెలుగు సంఘం ఉగాది సంబురాలను శనివారం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత తెలుగుభాష గొప్పదనాన్ని, విశిష్టతను ఇలా కవిత రూపంలో వినిపించారు. మలేషియాలోని తెలుగు వారందరికీ దుర్మిఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ … Read more

ఈ వెబ్సైట్ ఎందుకు?

bapu-telugu

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. … Read more

ఉగాది నాడు మండుటెండలో తెలుగుతల్లి ఆవేదన దీక్ష చేసిన యార్లగడ్డ

yarlagadda

తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ హిందీ, తెలుగు పండితుడు, విద్యావేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవేదన దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మండుటెండలో ఆయన ఆవేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పుష్కరాల ముగింపు ఉత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానం చేతల్లో ఇంతవరకు అమలు చేయకపోవటం బాధాకరమని అన్నారు. … Read more