Telugu Panchangam 2024-2025 Download PDF శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగం

Sri-Krodhi-Nama-Samvatsara

Sri Krodhi Nama Samvatsara (Ugadi) Panchangam 2024-25 pdf: As Ugadi (New Year Day for Telugu People) is being observed on 9th April 2024, the Panchanga Pathanam is a Must-Read and listen for all Telugu people across the globe. This Year is Called Sri Krodhi Nama Samvatsaram (శ్రీ క్రోధి నామ సంవత్సరం). This year starts on Ugadi … Read more

పద్మ విభూషణుడు రామోజీరావు

ramoji-rao

నిరంతర శ్రమ.. నిత్యం కొత్తదనం కోసం తపన.. నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ.. పుట్టిన నేల కోసం చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం.. చెక్కు చెదరని ఆత్మస్థైర్యం.. అన్నీ కలిసిన ఆ ఆధునిక రుషి పేరే రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్కా చిందించి.. పగలూ రాత్రి పరిశ్రమించి సృష్టించిన ఆ మహా సామ్రాజ్యం పేరే రామోజీ గ్రూప్‌! ప్రత్యక్షంగా పాతిక వేల మందికీ పరోక్షంగా అనేకానేక మందికీ ఉపాధి … Read more

తెలుగు జాతీయాలు సేకరణ (సాక్షి నుండి)

జాతీయాలకు తెలుగు భాష పెట్టింది పేరు. మన భాషలో ఉన్నన్ని జాతీయాలు ఏ ఇతర భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు . ఎదుటివారి మనసు చివుక్కుమనకుండా అంటే “కర్ర విరగా కూడదు .. పాము చావాకూడదు” అన్నట్లుగా చెప్పే ఈ జాతీయాలను గత కొంతకాలం నుంచి ప్రతీ ఆదివారం సాక్షి ఫన్ డే ఎడిషన్ లో మనకు అందిస్తూ ఉంది . ఈ ప్రయత్నం చాలా మెచ్చుకోదగినది. తెలుగు భాషా పునరుద్దరణలో ఇది చాలా మంచి కార్యక్రమం … Read more

పాఠశాల, కళాశాల స్థాయిలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీకే నష్టం!

దేశంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అత్యున్నత గౌరవ ప్రదమైన ఉద్యోగార్థుల కోసం యూపీఎస్‌సీ ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. వ్యాసరూప ప్రశ్న జవాబులుండే ప్రధాన పరీక్ష మార్కులను ఇంటర్వ్యూ మార్కులను కలిపి చివరి ఎంపిక ఉంటుంది. ఈ ప్రధాన పరీక్షలో ఒక ఎస్సే, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, రెండు ఆప్షనల్‌ సబ్జెక్టు పేపర్లతో పాటు ఇంగ్లీషు ఒక భారతీయ భాషలో కూడా పరీక్ష ఉంటుంది. అయితే ఇంగ్లీషు, భారతీయ భాష పరీక్షలు పదవ తరగతి స్థాయి ఉండి … Read more

14న విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలు

విజయనగరం జిల్లా స్థాయి బాలల నీతి కథల పోటీలను ఈనెల14వ తేదిన నిర్వహిస్తున్నామని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 14వ తేదీ పది గంటలకు విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని గురజాడ పాఠశాలలో 7, 8, 9, 10 తరగతి విద్యార్థులకు నీతి కథల పోటీలు ఉంటాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు వరుసగా రూ.500, రూ.300, రూ.200 నగదు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.

డల్లాస్ తెలుగు మహాసభలకు నాటా భారీ ఏర్పాట్లు

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న డల్లాస్ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జరగునన్న మహాసభల్లో ఉత్తర అమెరికా నుంచే కాకుండా.. కెనడా, ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని నాటా ప్రతినిధులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్ల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎన్నో … Read more

ఒంగోలులో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా సమాచార సాంస్కృతిక శాఖ నిర్వహణలో మంగళవారం రాత్రి ప్రకాశం భవన్‌లో కందుకూరి వీరేశలింగం నాటక రంగ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ముఖ్యఅతిథిగా జాయింట్‌ కలెక్టర్‌-2 ప్రకాష్‌కుమార్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. నాటక రంగానికి వీరేశలింగం పంతులు చేసిన కృషి అనన్యమన్నారు. ఆయన అందించిన స్ఫూర్తితో ప్రభుత్వం రంగస్థల కళాకారుల సంక్షేమానికి అనేక విధాలా చేయూత అందిస్తోందన్నారు. విశిష్ట అతిథులు డీఆర్వో … Read more

తెలుగు పరిరక్షణకు కృషి చేయాలి: తనికెళ్ల

తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సినీనటుడు, కవి తనికెళ్ల భరణి అన్నారు. గురువారం గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరుకు వచ్చిన ఆయన తెలుగు పండితులతో ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాషా్ట్రల్లో కమ్మని తెలుగుభాషను పరిరక్షించేందుకు పండితులు నడుం బిగించాలన్నారు. source: Andhrajyothy

తెలుగులో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్

zirodha-telugu

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో పాలుపంచుకోవాలంటే ఆంగ్ల భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఈ కారణంగానే ప్రాథమిక విద్య మాత్రమే పూర్తి చేసిన భారతీయ గ్రామీణ ప్రజలు ట్రేడింగ్ లో ఇప్పటిదాకా కాలు మోపనే లేదు. అయితే ఇలాంటి వారి కోసం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘జిరోధా’ కీలక అడుగు వేసింది. ఇక నుండి, తెలుగులోనూ ట్రేడింగ్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. తద్వారా తెలుగు భాషను దేశంలోనే తొలి ప్రాంతీయ భాషా ట్రేడింగ్ ఫ్లాట్ ఫాంగా … Read more

రాష్ట్ర విభజనతో నాటక రంగంలో సరికొత్త పోకడలు..!

తెలుగు నాటకరంగంలో రాష్ట్ర విభజన సరికొత్త పోకడలకు తెరతీసింది. తెలుగు నాటక దినోత్సవంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పండుగగా జరుపుకునే ఏప్రిల్‌ 16 ఇప్పుడు హైదరాబాద్‌లో పండుగ వాతావరణమే లేకుండా పోయింది. తొట్టతొలితెలుగు రంగస్థల ప్రదర్శనకు తెరతీసిన కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి నగరంలో అనామకం అయిపోయింది. గతంలో వేలాది మంది ఉత్సాహంగా ఊరేగింపులు తీసి సంబరాలు చేసుకున్న తెలుగురంగ స్థల దినోత్సవం ఈ ఏడాది నగరంలో వెలవెలబోతుంది. ఆదివారం సెలవు కలసిరావడంతో అలనాటి స్టేట్‌ ఫెస్టివల్‌ … Read more