అన్ని తెలుగు శతకములు PDF – Satakam in Telugu Download

satakamulu-pdf

తెలుగు శతకములు పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. క్రింది లింకుల ద్వారా వివిధ శతకములు, పద్యాలు pdf రూపంలో download చేసుకోవచ్చు . ఈ పద్యాలు పిడిఎఫ్ రూపంలో రూపొందించినవారెవరో తెలియరాలేదు .వారికి ప్రత్యేక ధన్యవాదాలు! ఇక్కడ మీకోసం అనేక శతకములు … కొన్ని మరుగున పడినవి కూడా సమర్పించుచున్నాము. ఉచితంగా దిగుమతి చేసుకొని సంస్కృతీ పరిరక్షణకు ఉపయోగించ గలరు. 50+ Satakamulu PDF Download Links సుమతీ శతకం వేమన పద్యాలు శ్రీకృష్ణ శతకం శ్రీకాళహస్తి శతకం … Read more

పద్మ విభూషణుడు రామోజీరావు

ramoji-rao

నిరంతర శ్రమ.. నిత్యం కొత్తదనం కోసం తపన.. నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ.. పుట్టిన నేల కోసం చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం.. చెక్కు చెదరని ఆత్మస్థైర్యం.. అన్నీ కలిసిన ఆ ఆధునిక రుషి పేరే రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్కా చిందించి.. పగలూ రాత్రి పరిశ్రమించి సృష్టించిన ఆ మహా సామ్రాజ్యం పేరే రామోజీ గ్రూప్‌! ప్రత్యక్షంగా పాతిక వేల మందికీ పరోక్షంగా అనేకానేక మందికీ ఉపాధి … Read more

గూడ అంజయ్య – Guda Anjaiah

ఆయన పాటలు ఆయుధాలు.. ఆ పాటల్లో పదాలు దూసుకుపోయే తూటాలు! సామాజిక ఉద్యమాలకు, ప్రగతిశీల శక్తులకు తిరుగులేని అస్ర్తాలు! ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణాలను దర్శించినా.. ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా అంటూ ఊరుమ్మడి బతుకుల్ని ఏకంచేసి.. దొరపై తిరుగుబాటుకు పురికొల్పినా.. భద్రం కొడుకో.. అంటూ రిక్షా కార్మికుడిని అప్రమత్తం చేసినా.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ప్రభుత్వవైద్యం గుల్లతనాన్ని నిలువునా కడిగేసినా.. అవ్వోడివా నువ్వు అయ్యోడివా.. తెలంగాణోనికి తోటి పాలోడివా? అని … Read more

పాఠశాల, కళాశాల స్థాయిలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీకే నష్టం!

దేశంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అత్యున్నత గౌరవ ప్రదమైన ఉద్యోగార్థుల కోసం యూపీఎస్‌సీ ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. వ్యాసరూప ప్రశ్న జవాబులుండే ప్రధాన పరీక్ష మార్కులను ఇంటర్వ్యూ మార్కులను కలిపి చివరి ఎంపిక ఉంటుంది. ఈ ప్రధాన పరీక్షలో ఒక ఎస్సే, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, రెండు ఆప్షనల్‌ సబ్జెక్టు పేపర్లతో పాటు ఇంగ్లీషు ఒక భారతీయ భాషలో కూడా పరీక్ష ఉంటుంది. అయితే ఇంగ్లీషు, భారతీయ భాష పరీక్షలు పదవ తరగతి స్థాయి ఉండి … Read more

అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్

అమెరికాలో మరో సరికొత్త తెలుగు అసోషియేషన్ వెలసింది. ఉన్న తెలుగు సంఘాలతో మైత్రీ బంధాన్ని పెనవేసుకుంటూ, తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కొన్ని వినూత్నప్రయత్నాలు తలపెడుతున్నట్టు న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ చిన్నా వాసుదేవరెడ్డి తెలిపారు. తెలుగువారి మధ్య న్యూజెర్సీ నగరంలో ఈ వేడుక జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రవాసభారతీయ విద్యార్థులు ప్రదర్శించినసాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే రీతిలో జరిగాయి.ఈ వేడుకలో న్యూజెర్సీ కాంగ్రెస్ మ్యాన్ గా తెలుగు వారి కీర్తిని ఇనుమడింపచేస్తున్న … Read more

కువైట్ లో తెలుగు కళా సమితి వారిచే విశిష్ట కళా ప్రదర్శన “స్వరాభినయ సంగమం”

కువైట్ లో తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుటలో “తెలుగు కళా సమితి” పెట్టింది పేరు. కువైట్ లో ఇంతటి గొప్ప పేరు కలిగిన ‘తెలుగు కళా సమితి’ మే 6 వ తేదీన, సాయంత్రం 5 గంటల నుండి మంగాఫ్ లోని కేంబ్రిడ్జి ఇంగ్లీష్ స్కూల్ లో తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలైన గుమ్మడి గోపాల కృష్ణ, 6 లైన్స్ గా అవబోతున్న బందర్ రోడ్డులో కంకిపాడు వద్ద వరల్డ్ క్లాస్ వెంచర్ విజిల్ శివప్రసాద్, సాకేత్ కోమండూరి, నికితా శ్రీవల్లి, సాయి హేమంత్ లచే “స్వరాభినయ సంగమం” … Read more

పద్మ భూషణుడు మన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

మాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్రీయ హిందీ సంస్ధాన్ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త, రచయిత, జాతీయ స్ధాయి ప్రముఖులు, అజాతశతృవు, పద్మశ్రీ, ఇరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈరోజు రాష్ట్రపతి భవనంలో జరిగే పద్మ పురస్కారాల కార్యక్రమంలో హిందీ, తెలుగు భాషలకు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అందించిన సేవలకు గానూ పద్మభూషణ్ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ లంకెలో వీక్షించవచ్చు – … Read more

ఈ వెబ్సైట్ ఎందుకు?

bapu-telugu

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు ప్రాశస్త్యం గురించి చెప్పాడు. తేట తేట తెలుగు తీపి గురించి కవులు గానం చేశారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా తెలుగు భాష పేరు గాంచింది. అజంత భాష తెలుగు భాష పలుకు వినసొంపుగా ఉంటుంది. రాతలో దానికో సౌందర్యం ఉంది. మూల ద్రావిడం నుంచి పుట్టిన తెలుగు భాష విశేష జనాదరణ పొందింది. అంతేకాకుండా తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉంది. … Read more

ఉగాది…

ugadi-pachchadi

ఉగస్య ఆది ఉగాది … ఉగ అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ’ఆది’ ’ఉగాది’ అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. తత్రచైత్రశుక్ల చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది ‘ఉగాది’గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు. ఉగాది పండుగ … Read more